వంగవీటి రాధతో వల్లభనేని వంశీ భేటీ

తాజా వార్తలు రాజకీయ వార్తలు
0
(0)

కృష్టా  జిల్లాలోని గన్నవరంలో వైసీపీ మద్దతుదారుడు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీ నేత వంగవీటి రాధా భేటీ అయ్యారు. చాలా రోజుల తర్వాత వల్లభనేని వంశీ వంగవీటి రాధాను కలవడం ఆసక్తికరంగా మారింది.  ప్రైవేట్ ఫంక్షన్‌లో కాసేపు వారు ఏకాంతంగా చర్చించుకున్నట్లు సమాచారం. వంగవీటి రాధను దగ్గరుండి వంశీ కారులో ఎక్కించారు. ఈ దృశ్యం కాస్త మీడియా కంటపడింది. మీడియా వారిని ప్రశ్నించగా. స్నేహితులం కాబట్టే మాట్లాడుకున్నామని చెప్పినట్లు తెలిసింది. ఈ ఇద్దరి కలయికపై రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.   

ఇదిలా వుండగా అప్పట్లో రంగా వర్ధంతి సందర్భంగా ఇద్దరూ కలుసుకున్న విషయం తెలిసిందే. టీడీపీ నేత వంగవీటి రాధాను వల్లభనేని వంశీ విజయవాడలోని రాధా కార్యాలయంలో భేటీ అయ్యారు. అనంతరం వంగవీటి రంగా 33వ వర్థంతి సందర్భంగా బందరురోడ్డులోని ఆయన విగ్రహానికి రాధా, వంశీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ వంగవీటి రంగా ఆశయ సాధనకు కృషి చేస్తానని చెప్పారు. రంగా వర్థంతి సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. వంగవీటి రాధా టిడిపిలో ఉన్నారు. టిడిపి టిక్కెట్‌పై గెలిచిన వల్లభనేని వంశీ వైసిపిలో కొనసాగుతున్నారు. దీనిపై వంగవీటి రాధా, వల్లభనేని వంశీ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

వంగవీటి రాధాకృష్ణ రాజకీయ పయనం ఎటువైపు. చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది.. సోషల్ మీడియాలో ఏదేదో ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరినా.. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. అప్పుడప్పుడు అమరావతి రైతుల ఉద్యమం, ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరవుతూ కనిపిస్తున్నారు.. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. తాజాగా వంగవీటి రాధాను వల్లభనేని వంశీ కలవడం ఆసక్తికరంగా మారిది.

వంగవీటి రాధా 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ పెద్దగా బయటకు రాలేదు. తర్వాత కొద్దిరోజులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలవడంతో ఆ పార్టీలోకి వెళతారనే ప్రచారం జరిగింది. తర్వాత అమరావతి ఉద్యమం సమయంలో చంద్రబాబును విజయవాడలో పోలీసులు అరెస్ట్ చేయడంతో.. రాధా చంద్రబాబు ఇంటికి వెళ్లి కలిశారు. తర్వాత అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్నారు. మరి వంగవీటి రాజకీయ భవిష్యత్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతోంది.

Click on a star to rate it!

Average rating 0 / 5. Vote count: 0

No votes so far! Be the first to rate this post.