రాజమౌళి దర్శకత్వం లో విడుదల అయ్యిన RRR ఘనవిజయం తో పాటు అధ్బుతమైన వసూలు సాధించిన విషయం తెలిసిందే, చిత్రం విడుదలైనప్పటి నుంచి ఇప్పటీకి ఇద్దరు హీరో అభిమానులు మధ్య క్రెడిట్ విషయం దూషణలు , మాటల యుధ్ధం సొషల్ మీడీయా వేదికగా నడుస్తూ ఉంది. కానీ అసలు క్రెడిట్ ఎవరిది ?
రాజమౌళి దర్శకత్వం లో రామారావు మరియు రామ్ చరణ్ మల్టీస్టారర్ అని ప్రకటించగానే సినీ అభిమానులు మరియు వారి అభిమానులు ఒకింత షాక్ , ఒకింత ఉత్సాహం చూపించారు. ఇద్దరి ఫ్యామిలీల అభిమానులను తృప్తి పరచటం కత్తి మీద సాము లాంటిది. కానీ అసలు చిత్రంలో ఎవరి పాత్ర ఎంత ?
ఎన్టీఆర్
ఎన్టీఆర్ లో ఉన్న నటనను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవటంలో రాజమౌళి దిట్ట. ఈ చిత్రం లోని పరిచయ సన్నివేశాలు , హీరో హీరోయిన్ సన్నివేశాలు , పాప ని కాపాడాలని పరితపించే సన్నివేశాలలో ఎన్టీఆర్ నటన అధ్బుతం, నాటు నాటు సాంగ్ లో డాన్స్ మరియు విరామం ముందు వచ్చే సన్నివేశం లో ప్రేమ , బాధ , కోపం , నిస్సహాయతతో కూడిన నటన ప్రేక్షకుల మరియు అభిమానులను ఉర్రూతలూగించింది. ఒక విధంగా మొదటి బాగం లో ఆద్యంతం ఎన్టీఆర్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇక మలి బాగంలో లో కొమురం భీముడో పాటలో ఎన్టీఆర్ తన అద్భుత నటనతో ప్రేక్షకుల సైతం కంటతడి పెట్టించాడు. రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పినట్టుగా ఎన్టీఆర్ మాత్రమే చేయగలిగిన పాత్ర ఇది.
రామ్ చరణ్
రామ్ చరణ్ లో ఉన్న నటుడు ని రాబట్టుకుంది ఇద్దరే దర్శకులు ఒకరు రాజమౌళి ఇంకొకరు సుకుమార్.ఈ చిత్రం లోని పరిచయ సన్నివేశాలు , భీమ్ పాత్రతో ప్రెండ్ షిప్ , ఇంటర్వెల్ సన్నివేశాలలో ఆకట్టుకున్నాడు. మలి భాగం లో స్నేహితుడు శిక్షించే సమయంలో తను పడే మనో వేదన, తన లక్ష్యం కోసం పడే తపన లో బాగా నటించాడు, ఇక క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశం అతని అభిమానులను ఉర్రూతలూగించాడు. ఈ చిత్రం లో ని రామరాజు పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు.
రాజమౌళి
నా అభిప్రాయం ప్రకారం రాజమౌళి చిత్రాలలో ఇది వీకెస్ట్ ఫిల్మ్, కానీ చిత్రంలో లో పైన చెప్పిన విధంగా కొన్ని బలమైన సన్నివేశాలు , ఎన్టీఆర్ , చరణ్ ల నుండి పూర్తి స్థాయిలో నటన రాబట్టుకోవటం మరియు చిత్రం పై జనాల్లో ఉన్న ఆసక్తి కారణం గా ఈ చిత్రం విజయం సాధించింది. ఇక చిత్రం లో రాజమౌళి ఇద్దరి హీరో ల పాత్రల బ్యాలన్స్ చేయటానికి తెలివితేటలను ప్రదర్శించాడు. ఎన్టీఆర్ ను పూర్తి స్థాయిలో నటనకు ప్రాధాన్యత పాత్రని , ఇంకో పక్క చరణ్ పాత్రకు కథా బలాన్ని జోడించి చిత్రాన్ని నడిపారు.
ఆసలు సమస్య ఏంటి ? వాస్తవం ఏమిటి ?
చిత్రం మొదలు పెట్టినప్పటి నుండి సగటు ప్రేక్షకుడు మరియు అభిమానులకి ఆద్యంతం ఎన్టీఆర్ ఆదిపత్యం చెలాయిస్తాడాని నమ్మకం, చరణ్ అభిమానులు ఎటువంటి అంచనాలు లేకుండా ఉండటం. అసలు చిత్రం లో మొదటిబాగం మొత్తం ఎన్టీఆర్ ఆధిపత్యం ప్రదర్శంచాడు అది కాదనలేని వాస్తవం. ఇక మలి సగం లో కొమురం భీముడో పాట కూడా కొంతమీర చిత్రాన్ని నిలబెట్టింది, ఇక్కడ కథాబలంతో ముడిపడి ఉండటం వలన రామ్ చరణ్ పాత్ర ప్రాధాన్యత పెరుగుతూ రావటం, కథానుగుణంగా ఎన్టీఆర్ చెప్పిన సంభాషణలు మరియు క్లైమాక్స్ లో రామ రాజు పాత్రని ఎలివేట్ చేయటం, భీమ్ పాత్ర అవకాశం ఉండి కూడా ఉపయోగించుకోకపోవటం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మింగుడు పడని అంశం. కానీ గమనించాల్సిన విషయం రామ్ చరణ్ పాత్రకు ఎలివేట్ చేసిన అంశాలు అప్పటి వరకు తక్కువ అందుకే ఉద్దేశపూర్వకంగా రాజమౌళి మెగా అభిమానులు దృష్టి లో పెట్టుకొని పెట్టిఉండవచ్చు.ఇక్కడ చెప్పాల్సిన విషయం ఇంకొకటి ఉంది అది సినిమా చూసి వచ్చిన సగటు ప్రేక్షకుడి కి ముందుగా సెకండ్ హాఫ్ మాత్రమే దృష్టి ఉంటుంది, అందు వలన ఎన్టీఆర్ లోని కొంతమంది అభిమానులు బాధ పడుతూ సోషల్ మాధ్యమాల్లో వ్యక్తపరచటం , చరణ్ పాత్ర తో సంతృప్తి పడ్డ అతని అభిమానులు ఆనందపడటం ఇక ఆ తర్వాత ఇలా ఇరు అభిమానులు మా హీరో నే అసలు హీరో అంటూ పరిధులు దాటి గొడవలు, ధూషణలు దిగటం జరుగుతుంది. ఇటివంటి పరిణామాల వల్ల భవిష్యత్తులో మల్టీ స్టారర్ చిత్రాలు చేయటానికి ఏ హీరో ముందుకు రారు .కానీ ఒక్క విషయం ఈ చిత్రం లో ఎవరి పాత్రని వారు పూర్తి స్థాయిలో న్యాయం చేయటం జరిగింది.
— పి. కృష్ణ
మీ అభిప్రాయం ఏమిటో క్రింద కామెంట్ సెక్షణ లో వ్రాయండి .
నిరాకరణలు: వెబ్సైట్ యొక్క www.toliadugu.com లేదా సబ్డొమైన్లలో ప్రచురించబడిన కథనాలు మరియు కంటెంట్ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. www.toliadugu.com లేదా వెబ్సైట్ సబ్డొమైన్లలో ప్రచురించబడిన కథనాలలో ఉపయోగించిన మొత్తం సమాచారం విశ్వసనీయ మూలాల నుండి వచ్చినదని విశ్వసించబడింది, అయితే మేము దీనితో సంపూర్ణత, ఖచ్చితత్వం లేదా విశ్వసనీయత గురించి ఎలాంటి ప్రాతినిధ్యాలు లేదా హామీలు ఇవ్వము, వ్యక్తీకరించాము లేదా సూచించాము ఈ వ్యాసానికి సంబంధించి
Disclaimers: Articles and Content published on www.toliadugu.com or subdomains of the website, is just for informational purposes only. All information used in the articles published on www.toliadugu.com or subdomains of the website is believed to be from reliable sources, but we make no representations or warranties of any kind, express or implied, about the completeness, accuracy, or reliability with respect to these article.