టీడీపీ తస్మాత్ జాగ్రత్త!

తాజా వార్తలు తాజా విశ్లేషణలు ప్రత్యేక వ్యాసాలు రాజకీయ వార్తలు
0
(0)

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్.. త్వరలో లోకేష్ ఆరెస్ట్ అంటూ ఊహాగానాలు. వైకాపా సరిగ్గా 6 నెలల ఎన్నికలు ముందు అమలు పరుస్తున్న వ్యూహం.. దీనికి కారణం. ఒక పక్క జగన్ పై వ్యతిరేకత, అధికార పార్టీ శాసన సభ్యుల గడప..గడపకు కార్యక్రమలో ప్రజల నుండి ఛీత్కారాలు , నిరసనలు. మరో పక్క చంద్ర బాబు రోడ్ షోలకు వస్తున్న ఆదరణ.. లోకేశ్ యువగళం విజయవంతంగా జరుగుతూ ఉండటం. 2024 ఎన్నికలలో గెలుపు పై ఆశలు సన్నగిల్లటం వైకాపా ఈ మార్గాన్ని ఎంచున్నట్లు కనపడుతుంది.

చంద్రబాబు అరెస్ట్.. వైకాపాకి ఎలా లాభం

టీడీపీ

సాధారణంగా ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేస్తే అది అధికారపార్టీకీ నష్టం వాటిల్లుతుంది, కారణం సానుభూతి. 40 రాజకీయ జీవితంలో చంద్రబాబు కు ఎటువంటి అవినీతి మరక లేదు….. ఉన్నట్లుండి స్కిల్ డెవెలప్ మెంట్ స్కామ్ అంటూ అరెస్ట్…..దీనిపై ప్రజల్లో చంద్రబాబు అరెస్ట్ ని కక్ష సాధింపు గానే ప్రజలు భావిస్తున్నారు. ఇది ఒక సెల్ఫ్ గోల్ లా ఉన్నప్పటికీ దీని వెనుక పలు కారణాలు లేకపోలేదు.

మొదటి కారణం –

గత రెండు దశాద్ధాలుగా పార్టీనీ నడిపిస్తున్న చంద్రబాబు అరెస్ట్ ద్వారా పార్టీ నాయకులు , కార్యకర్తల్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయటం , భయానికి గురిచేయటం.

రెండోవ కారణం –

ఎట్టిపరిస్తితుల్లో రక రకాల కేసులు బనాయించి చంద్రబాబు ను జైల్లో ఉంచాలనేది వైకాపా వ్యూహాం. టీడీపీ నియోజకవర్గల అభ్యర్థుల ఎన్నిక , సమీక్షలు , పర్యవేక్షించటం,పోల్ మ్యానేజ్ మెంట్ విషయాలకు చంద్రబాబు ని తప్పించటం ద్వారా లాభపడచ్చు అని వైకాపా ఆలోచన కావచ్చు.

మూడోవ కారణం –

దొంగవోట్లు అధికార పార్టీ వాలంటీర్ , సచివాలయ ఉద్యోగులను , ఉపయోగించికొని టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తీసివేసి , దొంగ ఓట్లను చేర్పించటం జరిగింది. దీనిపై ఈసీ నియోజగవర్గాల వారీగా ప్రతిపక్ష టీడీపీ సహాయంతో దొంగ ఓట్లు తొలగించే ప్రక్రియ చేపట్టింది. ఇక్కడే వైకాపా కి మింగుడు పడలేదు. వైకాపా రెబల్ ఎం.పీ రఘురామరాజు ఎన్నికల సంఘానికి దొంగ ఓట్ల లెక్కే కోరుతూ రాసిన లేఖకి దాదాపుగా 27లక్షల పై చిలుకు దొంగ ఓట్లు గుర్తించినట్టు గా బదులిచ్చింది.

ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ తో నాయకులు , కార్యకర్తలు నిరసనలు , దీక్షలు నిమగ్న మైన సమయంలో మరలా దొంగ ఓట్ల ప్రక్రియకు, టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తీసివేసే ప్రక్రియ మొదలు పెట్టింది.

నాలుగో కారణం –

అరెస్ట్ ల నేపధ్యంలో పరస్థితుల బట్టి ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందొస్తు ఎన్నికకు వెళ్ళటం వ్యూహంలో బాగం అయిఉండొచ్చు.

లోకేశ్ అరెస్ట్?.. ఎందుకు ?

ఒకప్పటికి లోకేశ్ అయితే వైకాపా , అతని అరెస్ట్ పై దృష్టి పెట్టేది కాదేమో.. ఇప్పటి లోకేష్ అయితే చంద్రబాబు అరెస్ట్ చేసినపట్టికి పార్టీని కొంతమేర లోకేశ్ భరోసా ఇవ్వగలడు, పార్టీ కార్యకలాపాలు నడిపించగలడు అనే పార్టీ క్యాడర్ నమ్మే స్థాయికి లోకేశ్ రూపాంతరం చెందాడు. యువగళం ద్వారా నాయకులకి , పార్టీ క్యాడర్ కి తన సామర్థ్యన్ని నిరూపించుకుంన్నాడు. బాబు లో లేని తెగింపుని లోకేశ్ చూపిస్తూ క్యాడర్ ని ఆకర్షించాడు.

లోకేశ్ సమర్థతని వైకాపా కూడా నమ్మింది కాబట్టి త్వరలో వైకాపా వ్యూహంలో లోకేశ్ అరెస్ట్ అనివార్యం. అప్పుడే పార్టీని నడిపించే నాయకులు లేక, పార్టీని సంక్షోభం లో నెట్టి పార్టీనీ అస్తవ్యస్తం చేయవచ్చు అనేది వ్యూహంలో భాగం అయ్యిండొచ్చు.

దీంట్లో బీజేపీ పాత్ర ఎంత ?

15 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పని చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయటం మామూలు విషయం కాదు. కేంద్ర ప్రభుత్వం అండ, అనుమతి లేకుండా ఇంతటి ధైర్యం , సాహసం జగన్ చేయడనే భావించాలి. ఎప్పటి నుంచో మోడీకి చంద్రబాబు పై ఉన్న అక్కసు, ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ టీడీపీ ని విచ్చిన్నం చేయటం ద్వారా బీజేపీ బలపడచ్చు అని వైకాపా కి సహకరించిండోచ్చు. వైకాపా – బీజేపీ లోపాయికారీ ఒప్పందం లో ఇంకా పెద్ద వ్యూహం ఉన్నట్లు కనిపిస్తుంది.

కానీ కొందరి పెద్దల సలహా మేరకు లోకేశ్ కేంద్ర ప్రభుత్వ సహకారం చేస్తుంది అనుకోవటం హాస్యాస్పదం. దీనీపై ప్రత్యేకంగా మరో ఆర్టికల్ లో http://www.Toliadugu.com విశ్లేషించటం జరుగుతుంది.

స్క్వాష్ పిటిషన్ హైకోర్ట్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీమ్ కోర్ట్ కి వెళ్ళటం ద్వారా న్యాయం జరుగుతుందని చంద్రబాబు నమ్మకం గా ఉన్నారు. ఒక వేళ కేసు కొట్టివేసిన పక్షంలో మరిన్ని కేసుల తో చంద్రబాబు అరెస్ట్ కి వైకాపా పక్కా ప్రాణాళికలతో ఉంటుంది అనటంలో ఎటువంటి అనుమానం లేదు.

ఇలాంటి వ్యూహాలను గమనించిన టీడీపీ ఒకవేళ లోకేశ్ కూడా అరెస్ట్ అయ్యే పక్షంలో ప్రత్యామ్నాయంగా నారా బ్రాహ్మిణి సారధ్యంలో నడుస్తామని ఇప్పటికే టీడీపీ ముఖ్యం నాయకుల ప్రకటించటం ద్వారా తమ నిర్ణయాన్ని క్యాడర్ కి స్పష్టంగా తెలియజేసింది.ఈ నిర్ణయం పార్టీ క్యాడర్ స్వాగతించినప్పటికి ఆ పరిస్థితి వస్తే ఆమె ఎంత వరకు సామాన్య ప్రజల్లో మమేకమౌతారో వేచిచూడాలి.

మరి ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్న టీడీపీ ఈ సంక్షోబాన్ని ఎలా ఎదుర్కొటుందో చూడాలి.

— పి. కృష్ణ

నిరాకరణలు: వెబ్‌సైట్ యొక్క www.toliadugu.com లేదా సబ్‌డొమైన్‌లలో ప్రచురించబడిన కథనాలు మరియు కంటెంట్ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. www.toliadugu.com లేదా వెబ్‌సైట్ సబ్‌డొమైన్‌లలో ప్రచురించబడిన కథనాలలో ఉపయోగించిన మొత్తం సమాచారం విశ్వసనీయ మూలాల నుండి వచ్చినదని విశ్వసించబడింది, అయితే మేము దీనితో సంపూర్ణత, ఖచ్చితత్వం లేదా విశ్వసనీయత గురించి ఎలాంటి ప్రాతినిధ్యాలు లేదా హామీలు ఇవ్వము, వ్యక్తీకరించాము లేదా సూచించాము ఈ వ్యాసానికి సంబంధించి

Disclaimers: Articles and Content published on www.toliadugu.com or subdomains of the website, is just for informational purposes only. All information used in the articles published on www.toliadugu.com or subdomains of the website is believed to be from reliable sources, but we make no representations or warranties of any kind, express or implied, about the completeness, accuracy, or reliability with respect to these article.

Click on a star to rate it!

Average rating 0 / 5. Vote count: 0

No votes so far! Be the first to rate this post.