జనసేన తో పొత్తు వద్దు అంటున్న టీడీపీ కార్యకర్తలు: 5 కారణాలు

తాజా విశ్లేషణలు
4.9
(13)

ఆంద్రప్రదేశ్ ముందస్తు ఎన్నికల సూచనలు ప్రస్తుత రాజకీయ పరిణామాలు చాలా ఆసక్తి గా నడుస్తున్నాయి ముఖ్యంగా పొత్తులపై ఇప్పటినుంచే ప్రతిపక్షపార్టీ టీడీపీ మరియు ఇతర పక్షాలు జనసేన, బీజేపీ సిద్దం అవుతున్నాయి.మొదటగా టీడీపీ జనసేన తో పొత్తు పై ఆసక్తి బహిర్గతం చేసింది,తరువాత జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా తన వ్యతిరేక వోటుని చీల్చబోమని టీడీపీ తో పొత్తుకి సిద్దం అన్నట్లు అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.కానీ తాజాగా పవన్ చేసిన వ్యక్త పరిచిన 3 ఆప్షన్స్ పసుపు సైన్యం కి ఆగ్రహం తెప్పించింది. దానికి గల కారణాలు

మొదటి కారణం – టీడీపీ కార్యకర్తల ఆత్మాభిమానం

తెలుగు ఆత్మగౌరవం తో పుట్టిన తెలుగు దేశానికి కార్యకర్తలు కొండంత బలం కానీ గత కొంత కాలంగా వారిని కొంతమేర వారి అభిప్రాయాలను అధినాయకత్వం విస్మరిసూ వస్తుంది. కొత్తగా ఏర్పడినా రాష్ట్రం లో జరిగిన 2014 ఎన్నికలలో బీజేపీ పొత్తు తో ఘన విజయం సాధించింది ఇక్కడా ముందుగా బీజేపీ కి కలిసి ఉన్న జనసేన టీడీపీ కి తన మద్దతు తెలపటం జరిగింది.ఆ తరువాత వివిద సందర్బాలలో జనసేనాని మరియు జనసైనికులు , వైఎస్సార్ సీపీ ఆ విజయాన్ని పవన్ కళ్యాణ్ ఖాతాలో వేసి టీడీపీ స్థాయి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అని టీడీపీ కార్యకార్తలు అభిప్రాయం. దీనికి సమాధానం గా 2014 ఎన్నికల ముందు జరిగిన స్థానికి సంస్థ ఎన్నికలు , మున్సీపాలిటీ ఎన్నికలలో టీడీపీ అత్యధిక స్థానాలు గెలవటం ద్వారా కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి చంద్రబాబు అవసరం దృష్ట్యా తాము ఒంటరికి గా పోటీ చేసిన గెలిచి ఉండే వాళ్ళం అని సమాధానం చెప్తూ వస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు జరిగిన విషయాల్లో టీడీపీ ని విమర్శిస్తూ వచ్చింది,సినిమాల పరంగా , ఇతర విషయాల్లో జనసేనాని సోదరుడు నాగబాబు స్థాయికి మించి శృతి మించి బాలకృష్ణ పై విమర్శలు చేయటం లాంటివి కార్యకర్తలకి నచ్చని ఆంశాల, ఆ తర్వాత 2019 ప్రశాంత కిషోర్ కులాల కుంపటి వ్యూహాలు , జగన్ చారిష్మా ఎన్నికలలో టీడీపీ ఘోర ఓటమి పాలయింది. జనసేన తో పాటూ జనసేనాని పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలయ్యాడు. కానీ పవన్ ప్రస్తుత వాఖ్యలు టీడీపీ తగ్గాలి , నాగబాబు ఎవరితో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్తి అనటం తో టీడీపీ కార్యకర్తలు నచ్చని విషయాలు , సోషల్ మాధ్యమాల్లో ఎక్కువ మంది కార్యకర్తలు తమ ఆత్మాభిమానం తో కూడిన ఆవేదనని పలు రకాలు గా వెల్లిబుచ్చారు .

రెండవ కారణం – పార్టీ ప్రజాదరణ

ఎన్టీఆర్ గారు టీడీపీ ఆవిర్భవించి 39 సంవత్సరాలు , అత్యంత బలమైన క్యాడర్, ప్రజాదరణ కలిగిన పార్టీ , కానీ ఇప్పటివరకు ఒక్కసారి ఒంటరిగా గెలవలేదు అయినప్పటికీ 2019 వైఎస్సార్ సీపీ ప్రభంజనం లో కూడా 40% ఓట్ల శాతం తో తన బలాన్ని నిరూపించుకుంది, జనసేన మొదటి సారి పోటీ చేసినప్పటికీ 7% ఓట్ల శాతాన్ని పొందింది కానీ 120 స్థానాలలో కనీస ఓట్లు సంపాదించలేకపోయింది , 16 స్థానాలో కనీస ఓట్లు మరియు ఒకే ఒక్క సీటు సాధించింది , పవన్ రెండు స్థానాలలో పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ 20 నుంచి 30 స్థానాలలో జనసేన పార్టీ కారణం గా టీడీపీ నష్టపోయింది అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం, కేవలం 7% ఉన్న జనసేన పార్టీ 40% ఉన్నా తమ పార్టీ ఆప్షన్స్ ఇవ్వటం టీడీపీ కార్యకర్తలకి మింగుడుపడని అంశం, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు ,రాష్ట్ర పరిస్థితి కారణం గా మరలా ప్రజలు చంద్రబాబు వైపు ఉన్నారని ఒంటరికి గా పోటీ చేసిన ఆఖండ మెజారిటీ తో గెలుస్తుంది అని వారి విశ్వాసం ,పైగా ఒంగోలులో జరిగిన మహానాడు విజయం మరింత ఆత్మస్టెరాన్ని, నూతనోత్సాహాన్ని నింపింది.

మూడో కారణం – పార్టీ నాయకుల అవకాశాలు

ఎప్పటీనుంచో పార్టీ పనిచేస్తూ అభివృధ్ధి కి కృషి చేస్తూ తదుపరి ఎన్నికలలో పోటీ చేయటానికి ఎదురు చూస్తున్న నాయకులు , వారికీ మద్దతు ఇస్తున్నా కార్యకర్తలు పొత్తులలో బాగంగా వారి సీట్లను త్యాగం చేయటానికి సిద్ధంగా లేరు, పైగా పవన్ కళ్యాణ్ ఎక్కువ స్తానాలు ఆశిస్తున్నారు. టీడీపీ అధినాయకత్వం త్యాగాలకు సిద్ధం అవ్వాలని సూచించినప్పటికి కొందరి నాయకులు దాని ద్వారా జరిగే నష్టాన్ని విన్నవించుకున్నారు.

నాలుగో కారణం – కుల సమీకరణాలు

మొదటి నుండీ బలహీన వర్గాలు , బీసీలు , కాపులు లో బలమైనా క్యాడర్ పార్టీ టీడీపీ , 2009 ఎన్నికలలో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించి ఆ సామాజిక వర్గ వోట్లు చీల్చటం ద్వారా ఆనాడు కాంగ్రెస్స్ రెండో సారి రావటాని ఒక కారణం గా నిలిచాడు. తర్వాత అదే విధంగా పవన్ ఆస్థాయిలో కాకపోయినా కొంతమేర చీల్చటం ద్వారా టీడీపీ కి నష్టం జరిగింది, ఇది ఇలా ఉండగా రిజర్వేషన్, కాపు కార్పోరేషన్ విషయం లో కాపులకి చంద్రబాబు చూపించిన చొరవ, ఆకారణం గా బీసీ లలో వ్యతిరేకత మరియు ప్రశాంత్ కిషోర్ కులాల కుంపట్ల ప్రోగ్రామ్, సోషల్ మీడియా ప్రభావం , కాపులు , బీసీలు ఓటర్లు దూరం అవ్వటం ద్వారా టీడీపీ అపజయం మూటగట్టుకుంది. ఈసారి ఎట్టి పరిస్థితలో ఈ రెండు కులాలను ఓటర్లను దగ్గర చేసుకోవాలని ఆశిస్తున్నారు, అనుకున్నట్లుగా ప్రస్తుత పరిణామాల దృష్ట్యా బీసీ కులాలు ఆ పార్టీ మొగ్గు చూపుతున్నాయి , ఇప్పుడు మరలా జన సేన పొత్తు బీసీ ఏమేరకు ఆమోదిస్తారో అని కార్యకర్తల ఆందోళన.

ఐదో కారణం – పార్టీ పై ఉన్న పొత్తుల ముద్ర

ఇప్పటివరకు పోత్తులు లేకుండా టీడీపీ గెలవలేదు అని ప్రతిపక్షాల విమర్శలు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఒంటరిగా పోటీ చేసి ఘన విజయం సాధించి విమర్శలకు తావులేకుండా సమాధానం చెప్పాలని సిద్దంగా ఉన్నారు .

చివరిగా: పైన చెప్పిన కారణాలు కార్యకర్తలు అభిప్రాయాలను పరిగణన లో తీసుకొని చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారో లేక తప్పని పరిస్తితుల్లో పొత్తులకు మొగ్గు చూపుతారో కాలమే సమాధానం చెప్పాలి

— పి. కృష్ణ

నిరాకరణలు: వెబ్‌సైట్ యొక్క www.toliadugu.com లేదా సబ్‌డొమైన్‌లలో ప్రచురించబడిన కథనాలు మరియు కంటెంట్ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. www.toliadugu.com లేదా వెబ్‌సైట్ సబ్‌డొమైన్‌లలో ప్రచురించబడిన కథనాలలో ఉపయోగించిన మొత్తం సమాచారం విశ్వసనీయ మూలాల నుండి వచ్చినదని విశ్వసించబడింది, అయితే మేము దీనితో సంపూర్ణత, ఖచ్చితత్వం లేదా విశ్వసనీయత గురించి ఎలాంటి ప్రాతినిధ్యాలు లేదా హామీలు ఇవ్వము, వ్యక్తీకరించాము లేదా సూచించాము ఈ వ్యాసానికి సంబంధించి

Disclaimers: Articles and Content published on www.toliadugu.com or subdomains of the website, is just for informational purposes only. All information used in the articles published on www.toliadugu.com or subdomains of the website is believed to be from reliable sources, but we make no representations or warranties of any kind, express or implied, about the completeness, accuracy, or reliability with respect to these article.

Click on a star to rate it!

Average rating 4.9 / 5. Vote count: 13

No votes so far! Be the first to rate this post.