పవన్ కళ్యాణ్ - చంద్రబాబు

పొత్తుకు తూట్లు పొడుస్తున్న పవన్ కళ్యాణ్

తాజా విశ్లేషణలు రాజకీయ వార్తలు
4.1
(15)

తేదేపా ఆధ్యక్షుడు చంద్రబాబు ఆరెస్ట్ తర్వాత రాజకీయంగా కొన్ని నాటకీయ పరిణామాలు జరిగాయి. అరెస్ట్ కు వ్యతిరేకంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు తో మూలాఖత్ లో పొత్తు ప్రకటన చేశాడు. ఒకింత చంద్రబాబు కూడా ముందుగా చెప్పినప్పుడు ఎందుకు ? ఇంత త్వరగా నిర్ణయం అని అడిగారని తెలిసింది.

“ఇద్దరి పార్టీ వారు గౌరవం ఇచ్చిపుచ్చుకోండి.. వారి మనో భావాలను దెబ్బ తినేలా జన సైనికులు మాట్లాడకండి – పవన్ కళ్యాణ్ “

“మనం వెళ్ళి బాలకృష్ణ – లోకేష్ మధ్యలో నుంచో గాని అని మనం ఏదో పెరిగిపోయాం! వారేదో తగ్గిపోయాం అని కాదు – పవన్ కళ్యాణ్”

పొత్తు ప్రకటన తర్వాత జనసేనాని వారి కార్యకర్తలు కు ,మద్దతు దారులకు పైన పేర్కొన్న వ్యాఖ్యలు ఇవ్వడం జరిగింది. వాటికి టీడీపీ వర్గాలు కూడా సానుకూలంగా స్పందించాయి. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కి మద్ధతుగా నాయకుల, కార్యకర్తలు రోడ్ షోలలో పాల్గోని మద్దతు తెలిపారు.

కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ యే అందుకు విరుద్ధం గా వ్యవహరిస్తున్నారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే

“టీడీపీ పార్టీ , నాయకులు బలహీనంగా ఉంది కాబట్టే వైకాపా ని పోరాడటానికి టీడీపీ తో పొత్తు ప్రకటించాం ప్రకటించాం – పవన్ కళ్యాణ్ “

సరిగ్గా ఇక్కడే టీడీపీ మద్దతు దారులకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కోపం తెప్పించాయి. 40 % ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ ని బలహీనంగా ఉంది అనటం టీడీపీ ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఇటువంటి వ్యాఖ్యలు సరికాదు అని సోషల్ మీడీయా వేదికగా జనసేనానిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

పవన్ కళ్యాణ్

“టీడీపీ – జనసేన – బీజేపీ 2014 లాగా కలివెళ్లాలి , ఆ దిశగా బీజేపీ ని ఒప్పిస్తా – పవన్ కళ్యాణ్ “

ఈ స్టేట్ మెంట్ అయితే సగటు టీడీపీ కార్యకర్తకు కోపం తెప్పిస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ లో బీజేపీ పాత్ర , వైకాపాతో లోపాయికారి ఒప్పందం, ప్రజల్లో బీజేపీ పై ఉన్న తీవ్ర వ్యతిరేకత వంటి కారణాల దృష్ట్యా టీడీపీ పార్టీ బీజేపీ తో కలసి వెళ్ళడం జరగకూడదు అని భావిస్తున్నాయి. అలా వెళ్తే అది సూసైడ్ కిందే భావించాల్సిఉంటుందని నాయకులు , కార్య కార్తల అభిప్రాయం. దీని కి బలాన్ని చేకూరూస్తూ టీడీపీ – జనసేన – బీజేపీ కలసి వెళ్తే ఓటమని ఖాయం అని కొన్ని సర్వేలు ప్రకటించాయి.

బీజేపీ ని కూడా కలుపుకొని వెళ్ళదలుచుకుంటే టీడీపీ అధినాయకత్వంతో చర్చించి వారి అభిప్రాయాన్ని తీసుకోవాలి. అలా కాకుండా ఇలా బహిరంగ ప్రకటనలు ఇవ్వటం పై పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ-వైకాపా వ్యూహంలో తెలియకుండానే లేదా తెలిసి నడుచుకుంటున్నారా! అని టీడీపీ క్యాడర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా పవన్ కళ్యాణ్ తాను ఇచ్చిన స్టేట్మెంట్స్ విరుద్ధంగా పొత్తుకు తూట్లు పొడిచే విధంగా నడుచుకుంటే నష్టం వాటిల్లుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.

http://www.toliadugu.com/2023/10/03/pavankalyanstayawayfrombjp/బీజేపీ ని వదిలించుకో! పవన్ కళ్యాణ్ చదవండి

— పి. కృష్ణ

నిరాకరణలు: వెబ్‌సైట్ యొక్క www.toliadugu.com లేదా సబ్‌డొమైన్‌లలో ప్రచురించబడిన కథనాలు మరియు కంటెంట్ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. www.toliadugu.com లేదా వెబ్‌సైట్ సబ్‌డొమైన్‌లలో ప్రచురించబడిన కథనాలలో ఉపయోగించిన మొత్తం సమాచారం విశ్వసనీయ మూలాల నుండి వచ్చినదని విశ్వసించబడింది, అయితే మేము దీనితో సంపూర్ణత, ఖచ్చితత్వం లేదా విశ్వసనీయత గురించి ఎలాంటి ప్రాతినిధ్యాలు లేదా హామీలు ఇవ్వము, వ్యక్తీకరించాము లేదా సూచించాము ఈ వ్యాసానికి సంబంధించి

Disclaimers: Articles and Content published on www.toliadugu.com or subdomains of the website, is just for informational purposes only. All information used in the articles published on www.toliadugu.com or subdomains of the website is believed to be from reliable sources, but we make no representations or warranties of any kind, express or implied, about the completeness, accuracy, or reliability with respect to these article.

Click on a star to rate it!

Average rating 4.1 / 5. Vote count: 15

No votes so far! Be the first to rate this post.