రఘురామ కృష్ణ రాజు పై ఉన్న శ్రద్ధ రాష్ట్ర సమస్యలు , హక్కులు పై పట్టవా ?

తాజా విశ్లేషణలు రాజకీయ వార్తలు
0
(0)

నిన్న భీమవరంలో జరిగిన శ్రీ అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ ఎన్నో నాటకీయ పరిణామాల నడుమ ఘనంగా జరగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ,రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ , ముఖ్యమంత్రి జగన్ మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కానీ స్థానిక పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణ రాజు ప్రోటోకాల్ ప్రకారం హాజరవ్వాల్సిన ఉండగా తన స్వంత పార్టీ తో విభేదాలు కారణంగా ఆహ్వానితుల జాబితా నుంచి వైకాపా తొలగించేలా చేసింది . అయినా తన హాజరవ్వాలని అనుకున్నప్పటికీ జగన్ ప్రభుత్వం ఎంపీ కీ అడుగడుగున ఇబ్బంది పెడుతూ అకారణంగా అతని అనుచరుల పై సుమోటో కేసులు నమోదు చేసి బెడించటం తో వారి శ్రేయస్సు కొరకు కార్యక్రమానికి వెళ్ళకుండా ఆగిపోతున్నానని రఘురామ కృష్ణ రాజు చెప్పటం జరిగింది. కానీ సదరు ప్రతిపక్ష పార్టీలు , మీడీయా ఈ అంశాన్ని కేవలం ఒక అంశం గా కాకుండా ఇదే ప్రధానా అంశం గా చూడటం ఎంతవరకు సబబు ? బీజేపీ పార్టీ రాష్ట్రం విషయం లో చేసిన అన్యాయాలను , హక్కులు ఎందుకని ప్రశ్నించటంలేదు ?

బీజేపీ ఇచ్చిన హామీలు, మోసాలు మర్చిపోయారా ?

ప్రత్యేక హోదా

తిరుపతిని తలదాన్నే రాజధాని ని నిర్మించటం తమ భాద్యత

రాయల సీమకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ

విశాఖకు రైల్వే జోన్

కడప స్టీల్ ప్లాంట్

పోలవరం

గత ప్రభుత్వ సమయంలో ఆంధ్ర కి పైన చెప్పిన హామీలను బీజేపీ తుంగలో తొక్కింది. అప్పటి ప్రతిపక్ష పార్టీ అయిన వైకాపా తాము వస్తే కేంద్ర మెడలు వంచి హామీలు సాధిస్తామని చెప్పిన జగన్ శాలువా లు , వైకాపా నేతల సాష్టాంగ నమస్కారాలతో రాష్ట్ర హామీలను వ్యక్తిగత అవసరాలకు తాకట్టు పెట్టిన విషయాలను ప్రశ్నించలేరా ?

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు

కొన్ని వందల ప్రాణ త్యాగాల , పోరాటాల ఫలితం గా ఏర్పడిన విశాఖ ఉక్కు ఖర్మగారం కేంద్రం ప్రవేటీకరణ కు సన్నద్ధం అవుతుంది. ఎన్నో రోజు లుగు నిరసన తెలుపుతున్న ఉద్యమకారులు , నిన్న జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి పై తమ నిరసనను తెలియజేశారు. కానీ ప్రతిపక్ష పార్టీలు , మీడీయా ఎందుకని తమ వంతు పాత్ర పోషించలేదు ?

టీడీపీ కి ఏమైంది

ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ గత కొంత కాలంగా జగన్ ప్రభుత్వం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను పలు మాధ్యమా, పలు విధాలుగా, పలు రకాలుగా పోరాడుతూ వస్తుంది. కానీ ఇవ్వవలసిన హామీలను గురించి బీజేపీ ని ఎందుకు లేవనెత్తలేదు? బీజేపీతో వైరం పెట్టుకోవటం ఇష్టం లేకనా ?. నిన్న టీడీపీ సోషల్ మీడీయా వింగ్ ఆద్యంతం రఘురామ అంశం గా ప్రభుత్వం విమర్శలు గుప్పించారు.

రఘురామ కృష్ణ రాజు కి పలు సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఇబ్బందులలో మీడీయా అండగా నిలిచింది. అతను కూడా రాష్ట్రంలో ప్రజల తరుపున తమ పార్టీపై పోరాడుతూ వస్తున్నా డు.

కేవలం ఈ అంశం మాత్రమే కాకుండా రాష్ట్ర సమస్యలను, హక్కులను , వైకాపా మరియు బీజేపీ లోపాయికారీ ఒప్పందాలను ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్బంగా లేవనెత్తి ఉంటే బాగుండేదేమో.

—- పి. కృష్ణ

నిరాకరణలు: వెబ్‌సైట్ యొక్క www.toliadugu.com లేదా సబ్‌డొమైన్‌లలో ప్రచురించబడిన కథనాలు మరియు కంటెంట్ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. www.toliadugu.com లేదా వెబ్‌సైట్ సబ్‌డొమైన్‌లలో ప్రచురించబడిన కథనాలలో ఉపయోగించిన మొత్తం సమాచారం విశ్వసనీయ మూలాల నుండి వచ్చినదని విశ్వసించబడింది, అయితే మేము దీనితో సంపూర్ణత, ఖచ్చితత్వం లేదా విశ్వసనీయత గురించి ఎలాంటి ప్రాతినిధ్యాలు లేదా హామీలు ఇవ్వము, వ్యక్తీకరించాము లేదా సూచించాము ఈ వ్యాసానికి సంబంధించి

Disclaimers: Articles and Content published on www.toliadugu.com or subdomains of the website, is just for informational purposes only. All information used in the articles published on www.toliadugu.com or subdomains of the website is believed to be from reliable sources, but we make no representations or warranties of any kind, express or implied, about the completeness, accuracy, or reliability with respect to these article.

Click on a star to rate it!

Average rating 0 / 5. Vote count: 0

No votes so far! Be the first to rate this post.