సీతక్క ని చూసి బుద్ధి తెచ్చుకోండి

తాజా వార్తలు
5
(1)

గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కారణం గా రెండు రాష్ట్రాలలో కొన్నిప్రాంతాలలో రాకపోకలు ,కనీస అవసరాలు లేక భాదితులు అవస్థలు పడుతున్నారు. కానీ ఇరురాష్ట్ర ప్రభుత్వాలు లో మాత్రం గాలిలో చక్కర్లు కొడుతూ తిరుగుతున్నా భాదితులును పరామర్శిస్తున్నారు.

కేసీఆర్ ఈ వరదలు ఇతర దేశాల కుట్ర, చైనా క్లౌడ్ బరస్ట్‌ అని పిట్ట కథలు వల్లిస్తున్నారు. ఒక సామెత ఉంది.. “వినే వాడు *** అయితే చెప్పేవాడు *** ” అన్నట్లు ఉంది. వరదల్లో చిక్కుకుపోయిన గ్రామాలకు కనీస అవసరాలు తీర్చకుండా ఇటువంటి స్టేటమెంట్ ఇస్తే ఏమానాలో చదివే మీకే వదిలేస్తున్నా.

మరో పక్క దివాళా దిశ గా పరుగుల తీస్తున్న అప్పుల ఆంధ్రప్రదేశ్ “ గోరు చుట్టూ పై రోకలి పోటు లా ” పోలవరం వరద ముంపు ఆదివాసీ గ్రామాలకు జగన్ ప్రభుత్వం ఒక్కో ఇంటికి 50 గ్రాముల కందిపప్పు, 4 టమాటాలు, 4 ఉల్లిపాయలు,4 ఆలుగడ్డలు అందించటంతో ప్రభుత్వ ఉదారత ను చూసి ముంపు భాదితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా మంత్రులు “వరదలను ఊహించలేదు – ఏవరు చనిపోలేదు గా ఎందుకు రాద్ధాంతం” లాంటి నిర్లక్ష్య స్టేట్మెంట్ల వారి విజ్ఞత కే వదిలేస్తున్నాం.

కనీసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ములుగు ఏం.ఎల్.ఏ సీతక్క ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. గతంలో కరోనా విపత్తు సమయంలో నైతేనేమీ , పలు సందర్భలలో నైతేనేమీ, ఇప్పుడు నైతేనేమీ భాదితులకు సీతక్క అండగా నిలబడ్డారు. కనీస అవసరాలు తన వంతు సహాయం చేస్తున్నారు.టీడీపీ కి చెందిన చింతమనేని ప్రభాకర్ , నిమ్మల రామానాయుడు , మరికొంత మాజీలు కూడా తమవంతు సహాయం అందించటం అభినందనీయం.


Click on a star to rate it!

Average rating 5 / 5. Vote count: 1

No votes so far! Be the first to rate this post.