అసహ్యించుకొనురు గాక…మాకేటి సిగ్గు: వైకాపా

తాజా వార్తలు తాజా విశ్లేషణలు
0
(0)

రాజకీయాలలో వైకాపా నాయకులు వ్యవహరిస్తున్న తీరు అసహ్యంగా , జుగుప్సా ఉంది. మొన్న ఎన్టీఆర్ చివరి కూతురు ఆత్మహత్య చేసుకోవటం జరిగింది. కుటుంబ సభ్యులు చెప్పిన ప్రకారం ఆరోగ్య సమస్యలు , మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టు తెలియజేశారు. కుటుంబ సభ్యుడు దూరం అయిన బాధలో ఉన్న ఇతర సభ్యులు పై వైకాపా నిస్సిగ్గు రాజకీయాలు మరింత బాధకు గురి చేస్తున్నారు.

బుద్ది లేదు.. సిగ్గులేదు

జగన్ ఆక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడు విజయ సాయి రెడ్డి , ఒక రాజ్య సభ సభ్యుడు, చార్టెడ్ అకౌంటెంట్ కానీ సోషల్ మీడీయా వేదికగా గతంలో రఘురామ కృష్ణ రాజు , చంద్రబాబు, లోకేష్ లపై , ఇప్పుడు ఉమా మాహేశ్వరి గారి పై వేస్తున్న ట్వీట్స్ దిగజారుడు తనాన్ని తెలియజేస్తుంది. ఒక చిన్న స్థాయి కార్యకర్త కూడా ఈరకంగా ఇంత అసహ్యంగా ట్వీట్స్ వేయలేరేమో.

దేవేంద్ర రెడ్డి గుర్రమపాటి , ఫారెస్ట్ కార్పోరేషన్ ఛైర్మన్. ఒక ప్రభుత్వ పదవిలో జనాల సొమ్ము అనుభవిస్తూ లోకేశ్ , చంద్రబాబు పై విషం చిమ్ముతూ కాలం గడిపేస్తున్నాడు.

ఇప్పుడు ఎటువంటి రాజకీయ సంబంధం లేని ఎన్టీఆర్ కూతురు పై చేస్తున్న దుష్ప్రచారం వీరి మానవత్వ విలువలు తెలియజేస్తుంది.

బాబాయి హత్యతో పోలిక

బాత్రూమ్ లో బాబాయ్ వివేకా హత్య ను స్వయంగా తన స్వంత కూతురి తన అన్న జగన్ ప్రభుత్వంలో న్యాయం జరగదని భావించి న్యాయపోరాటం చేసి సీబీఐ ఎంక్వైరీ వేయించటం జరిగింది. ఈ హత్యకు ఆ ఇంటి సభ్యులు మరియు వైకాపా నాయకులతో సంబంధం ఉన్నట్లుగా తేలింది. పైగా నారాసుర రక్త చరిత్ర అని టీడీపీ పై హత్యను మోపీ వైకాపా ఎన్నికల సమయంలో లాభపడింది. ఎప్పుడైతే వివేకా హత్యని సీబీఐ తేల్చటం తో టీడీపీ కార్యకర్తలు , నాయకులు జగన్ పై #WhoKilledBabai అని సోషల్ మీడీయా వేదికగా విమర్శలు సంధించారు. జనాల్లోకి చేరవేయటంతో పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఇక్కడే వైకాపా నాయకులకు మింగుడు పడని అంశం.

“తాము బురదలో మునిగినా పక్కనోన్ని బురదలో లాగాలనే సిద్ధాంతం ” తో ఉన్న వైకాపా ఎన్టీఆర్ చిన్న కూతురి మరణాన్ని బాబాయి హత్య తో పోల్చి “తాము ఎదవలం కాదు అని కాకుండా మాతో పాటు టీడీపీ వారు కూడా ఎదవల్ని చేయాలనుకోవటం” వైకాపా పార్టీ సిద్ధాంతం తెలియజేస్తుంది

హార్మోని విద్వాంసురాలు

ప్రముఖ హార్మోని విద్వాంసురాలు లక్ష్మీ పార్వతీ కి పేరు వెనక నందమూరి అని అన్నగారు స్థాయి కల్పించినప్పటికి నందమూరి కుటుంబ సభ్యులు పై,నారా కుటుంబ సభ్యులపై ఎప్పటికప్పుడు విషం చిమ్ముతూనే ఉంది. ప్రస్తుత ఆమె వైకాపాలో హార్మని ప్రదర్శనలు చేస్తూ తెలుగు అకాడమీ చైర్మెన్ పదవి సాధించి జగన్ పై తన విశ్వాసాన్ని చూపుతూ ముందుకు పోతూ ఉంది. ఈమె గతంలో ఫోన్ లో అన్నగారి మీద చేసిన వ్యాఖ్యలు , ఆమె పై మొదటి భర్త చేసిన వ్యాఖ్యలు బట్టి ఆమె యొక్క క్యారెక్టర్ ఏపాటిదో తెలియజేస్తుంది.

గతంలో చంద్రబాబు , వైస్ ఆర్ ఎన్ని రాజకీయ విమర్శలు చేసుకున్నప్పటికి విలువలు పాటించటం జరిగింది. కానీ వైఎస్సార్ వారసత్వం గా పుట్టిన వైకాపా శవ రాజకీయాలు, దిగజారుడు వ్యాఖ్యలతో రాజకీయాలను బ్రష్టుపట్టిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు .

పి కృష్ణ

నిరాకరణలు: వెబ్‌సైట్ యొక్క www.toliadugu.com లేదా సబ్‌డొమైన్‌లలో ప్రచురించబడిన కథనాలు మరియు కంటెంట్ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. www.toliadugu.com లేదా వెబ్‌సైట్ సబ్‌డొమైన్‌లలో ప్రచురించబడిన కథనాలలో ఉపయోగించిన మొత్తం సమాచారం విశ్వసనీయ మూలాల నుండి వచ్చినదని విశ్వసించబడింది, అయితే మేము దీనితో సంపూర్ణత, ఖచ్చితత్వం లేదా విశ్వసనీయత గురించి ఎలాంటి ప్రాతినిధ్యాలు లేదా హామీలు ఇవ్వము, వ్యక్తీకరించాము లేదా సూచించాము ఈ వ్యాసానికి సంబంధించి

Disclaimers: Articles and Content published on www.toliadugu.com or subdomains of the website, is just for informational purposes only. All information used in the articles published on www.toliadugu.com or subdomains of the website is believed to be from reliable sources, but we make no representations or warranties of any kind, express or implied, about the completeness, accuracy, or reliability with respect to these article.

Click on a star to rate it!

Average rating 0 / 5. Vote count: 0

No votes so far! Be the first to rate this post.