బీజేపీ

ఏపీ లో బీజేపీ మరో కుట్రకు తెరలేపిందా?

తాజా వార్తలు తాజా విశ్లేషణలు ప్రత్యేక వ్యాసాలు రాజకీయ వార్తలు
4.4
(8)

ఏపీ లో బీజేపీ పెద్ద కుట్రకు తెరలేపిందా ? గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అనుమానాలు బలపడుతున్నాయి. బీజేపీ ఎక్కడ బలంగా ఉంటుందంటే హిందూ – ముస్లీం గొడవలు ఎక్కడుంటే అక్కడ. హిందుత్వ అనే పునాదుల వాడుకుని బలపడిన పార్టీ బీజేపీ. ఇది కాదనలేని వాస్తవం.

హిందుత్వవాదం బలంగా ఉన్న ఉత్తర బారతదేశం లో బీజేపీ కొన్ని రాష్ట్రాలలో బలంగా ఉంది. కొన్ని రాష్ట్రాలలో కుట్రలతో ప్రభుత్వాలను కూల్చి తమ అధీనంలో పెట్టుకుంది.

కానీ బీజేపీ పాచికలు దక్షిణ భారతదేశం పారటం లేదు. కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ చేతిలో ఘోర పరాజయం. జయలలిత మరణం తర్వాత తమ ఆధీనంలో పెట్టుకున్న అన్నా డీయంకే కూడా ఎండీయే కూటమి నుండి బైటకి వచ్చింది.

ఇక తెలుగు రాష్ట్రాలలో బీజేపీ తెలంగాణాలో హిందూత్వం బలంగా ఉన్న హైదరాబాద్ లో తమ రహస్య మిత్రుడు ఏంఐఏం ఎన్నికల సమయానికి వివాస్పద వ్యాఖ్యలు చేయటం. దానికి ఇరువురు పార్టీలు ఉపయోగించుకొని లాభపడటం ఎవరు ఔనన్న కాదన్న ఇది వాస్తవం.ఇక వేరే ప్రాంతాల్లో నామమాత్రం. అక్కడ కేసీఆర్ రహస్య మిత్రుడు.

ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే ఉనికి మాట దేవుడెరుగు నోటాతో పోటీ పడే పరిస్థితి. కానీ ఇక్కడ పాగా వేయాలని ఎప్పటినుండో ప్రయత్నిస్తుంది.

బీజేపీ మొదటీ వ్యూహం – బాబు ని దోషి గా నిలబెట్టటం

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ కి బీజేపీ. చంద్రబాబు కి నమ్మబలికి. ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి ..ప్రత్యేక హోదా నిర్ణయం తర్వాత చూద్దాం అని చెప్పటం. చివరికి మొండి చేయి చూపటం ద్వారా బాబు ని ప్రజల ముందు దోషి గా నిలబెట్టాలని చూసింది. బాబు బీజేపీ ని వ్యతిరేఖించి బయటకు రావటం జరిగింది.

వైకాపాతో 2019 ఎన్నికలకు బీజేపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుకొని చంద్రబాబు ని కొంత మేర దెబ్బతీసింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ పై ఆగ్రహం 2019 ఎన్నికల్లో నోటాకంటే తక్కువగా ఓట్లతో ఘోర అవమానం చవిచూసింది.

మొదటి వ్యూహంలో కొంత మేర సఫలీకృతం అయిన.. బలపడే అవకాశం లేకుండా వ్యూహం బెడిసికొట్టింది.

రెండవ వ్యూహం – వైకాపా కి అన్నివిధాలా సహకారం?

వైకాపా అధికారం వచ్చే సమయానికి సుమారు 1లక్ష 50 వేల కోట్ల గా ఉన్న అప్పు ఈ 4 ఏళ్ల లో 9 లక్షల కోట్లకు చేరింది. ఈ అప్పులు , బాండ్లు కాక కేంద్రం నుండి అన్నీ విధాలుగా సహకారాలు అందిస్తూ వస్తుంది. బీజేపీ – వైకాపా బంధం పలు సందర్బాలలో బహిర్గతం అయ్యింది. జగన్ ఆక్రమాస్తుల కేసుల్లో ఉదారత తెలియజేసింది.

రాష్ట్రంలో రాజ్యాంగం కు వ్యతిరేకంగా కార్యకలాపాలు, ప్రతిపక్షాలపై కక్ష పూరిత చర్యలు , సామాన్య ప్రజలపై వేధింపులు, ప్రతిపక్ష నాయకుల ఆక్రమాకేసులు మరియు లా అండ్ ఆర్డర్ గతి తప్పినప్పటికి కేంద్ర ఎటువంటి చర్యలు లేకపోవటం, సాక్ష్యాత్తు ప్రతిపక్ష నేత అరెస్ట్ కూడా బీజేపీ – వైకాపా వ్యూహంలో బాగం గా భావించాలి.

మూడో వ్యూహం – ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో హింధుత్వాన్ని రెచ్చగొట్టాలనుకుందా ?

This image has an empty alt attribute; its file name is 636944743049954598-e1695567006473.jpg

బీజేపీ తమకు అలవాటైన హిందూత్వాని ప్రజల్లో రెచ్చగొట్టి బలపడచ్చుననని భావించిందా? గతంలో రాష్ట్రంలో పలు హిందూ దేవాలయాలలో దేవుళ్ళ విగ్రహాలు ద్వంసం చేయటం , విగ్రహాలను మలీనం చేయటం , రథాలు తగలపెట్టటం ద్వారా హిందూ ప్రజల్లో ఆవేశాన్ని రగిలించిందా ? అదే సమయంలో బీజేపీ హిందు సంరక్షణ కై పోరాడుతున్న పార్టీ గా జనాల్లో తీసుకెళ్లాలి పలు నిరశన కార్యక్రమాలు , హిందూ యాత్రలు అంటూ చేసిన బీజేపీ కార్యక్రమాలు కూడా పనిచేయలేదు.

ఈ వ్యూహంలో జగన్ పాత్ర కూడా కొట్టిపారేయలేం. జగన్ తన ఓటు బ్యాంక్ కి ఎటువంటి నష్టం వాటిల్లదు కాబట్టి టీడీపీ ని కూడా బలహీనపర్చవచ్చు అనే వ్యూహం తో బీజేపీ కి సహకరించిందా ?. కానీ బీజేపీ అనుకున్నట్టు టీడీపీ కార్యక్రమాలు తో ఈ వ్యూహం కూడా పారలేదా?.

నాలుగో వ్యూహం – టీడీపీ లేకుండా చేయటం(పస్తుతం అమలు చేస్తున్న వ్యూహం)?

ఈసారి బీజేపీ తదుపరి లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారం దక్కకుండా చేయటం.

మొదటిగా – టీడీపీ ని వచ్చే ఎన్నికల్లో ఓడించటం ?

చంద్రబాబు వయస్సు 73 సంవత్సరాలు ఒక రకంగా చెప్పాలంటే ఇవే చివరి ఎన్నికలు. ఈ విషయాన్ని చంద్రబాబు కూడా ప్రస్తావించటం జరిగింది. ఒకవేళ టీడీపీ అధికారంలో కి వస్తే మరో అయిదేళ్లు టీడీపీ భవిష్యత్తుకు ఆపై వచ్చే ఎన్నికలకు నాయకత్వం పై స్పష్టత పార్టీ మనుగడకు కీలకం అవుతుంది.

అందుకే చంద్రబాబు అరెస్ట్ పై వైకాపా ఆలోచన కి బీజేపీ ఆమోదం తెలిపింది మరియు అన్ని విధాలుగా సహకరిస్తుంది. పైకి తమకు సంభంధం లేనట్లు వ్యవహరిస్తున్నప్పటికి ఇది వైకాపా- బీజేపీ పక్కా స్కెచ్ లో భాగం. ఈ ఆరెస్ట్ ద్వారా టీడీపీ క్యాడర్ ఆత్మ స్థైర్యాన్ని , ఎన్నికల సన్నద్ధనికి కాకుండా చేయటం , ఒక కేసు బెయిల్ వస్తే , మరిన్ని కేసులు బనాయించటం వచ్చే ఎన్నికలకు కావాల్సిన దొంగ ఓట్ల చేరిక ప్రక్రియ , నాయకుల కేసులతో ఉక్కిరి బిక్కిరి చేసి , ఆర్థిక మూలాలు దెబ్బ తీసి ఎన్నికల్లో గెలవాలని వైకాపా భావిస్తుంది.

పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ వ్యూహంలో భాగమా ?

పవన్ కళ్యాణ్ - చంద్రబాబు

టీడీపీ- జనసేన పొత్తు పై తర్జన భర్జన పడుతున్న సమయంలో బాబు అరెస్ట్ తో పొత్తుకు శ్రీకారం పడింది. సరిగ్గా ఇక్కడే బీజేపీ వ్యూహానికి బ్రేక్ పడింది. టీడీపీ – జనసేన కలిసి వెళ్ళకుండా బీజేపీ ఎప్పటినుంచో పావులు కదుపుతుంది.

ఒక్కసారిగా పవన్ పొత్తు ప్రకటించటం తో బీజేపీ పవన్ ని దిల్లీకీ పిలిపించటం. అతర్వాత పవన్ టీడీపీ – జనసేన తో బీజేపీ కలసి వెళ్తుంది అని టీడీపీ ప్రమేయం లేకుండా పవన్ చెప్పటం పలు పవన్ కూడా బీజేపీ వ్యూహంలో భాగంగా మలుచుకుంటున్నాడా అని అనుమానాలు కలిగించాయి.

ఒకవేళ బీజేపీ తో కలసి వెళ్తే టీడీపీ – జనసేన సూసైడ్ కిందే లెక్క. ఇది మరోసారి వైకాపాకి అధికారం కట్టబెట్టిన పెట్టవచ్చు. ఇదే బీజేపీ వ్యూహం కావచ్చు.

ఒకవేళ టీడీపీ ఒప్పుకోని పక్షంలో పవన్ ని కూడా పొత్తు విరమణకు బీజేపీ ప్రయత్నించవచ్చు. ఎందుకంటే పవన్ కి జగన్ పై ఉన్న భయం కావచ్చు , తన పార్టీ కేంద్ర ప్రభుత్వం అండ వుంటే మంచిది అని కావచ్చు . ప్రస్తుతం పవన్ -బీజేపీ విడదీయని బంధం. నిన్న తెలంగాణ లో జరిగిన మోడీ సభలో పవన్ వ్యాఖ్యలు అందుకు ఉదాహరణ.

రెండోది పురందేశ్వరి ని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిని చేయటంలో మర్మం ఏమిటి ?

This image has an empty alt attribute; its file name is 031123purandeswari-brk1a.jpg

ఏపీ బీజేపీ మాజీ అద్యక్షుడు సోము వీరాజు ప్రభుత్వంతో సానుకూలంగా వ్యవహరిస్తూ ఉండేవాడు. ఉన్నట్టుండి ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి అధ్యక్షురాలిని చేయటం కూడా మర్మం చాలా లోతైనది.

మూడొవది – బీజేపీ అనుకున్నట్టు టీడీపీ ని రాకుండా చేయగలిగితే ?

బీజేపీ వ్యూహంలో టీడీపీ ని అధికారంలో కి రాకుండా చూడగలిగితే. ఈ ఐదేళ్ల పాలనలో జగన్ కక్ష పూరిత దోరణి , టీడీపీ నేతల పై బౌతీక దాడులు , ఆర్థిక దాడులు , ఆరాచక పాలనతో నాయకులకు క్యాడర్ లో భయాన్ని పుట్టించటం ద్వారా జగన్ ని ఎదుర్కోవాలి అంటే బీజేపీ అండ తప్పనిసరి అనే భావన క్యాడర్ మరియు నాయకులు లో తీసుకురావటం.

టీడీపీ క్యాడర్ కి ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి బీజేపీ అద్యక్షురాలిగా అని చూపియయటం.. ఆపై పదుల సంఖ్యలో నాయకులు బీజేపీ పార్టీ లో వలసలు చేర్చుకోవటం ద్వారా పార్టీ బలపర్చుకోవాలి.అప్పుడు టీడీపీ పూర్తిగా బాలహీనపడుతుంది.. దీనికి తోడు ఎలాగూ పవన్ ఉండనూఉన్నాడు.

అలాగే జగన్ జుట్టు తన చేతుల్లో ఉన్నందు వల్ల ఏవిధంగా వైకాపా బలి చేయచ్చు అనేది బీజేపీకి తెలుసు.

పైవన్ని టీడీపీని అధికారంలో కి రాకుండా చేయగలిగితేనే బీజేపీ వ్యూహం ఫలించవచ్చు..పార్టీ స్థాపించినప్పటినుంచి ఎన్నో సంక్షోబాలు ఎదుర్కొన్న టీడీపీ ప్రతిపక్షాలలు వ్యూహాలను తిప్పికొడుతుందో చూడాలి..

— పి. కృష్ణ

మరికొన్ని విశ్లేషణలు –

http://www.toliadugu.com/2023/09/24/tdp-becareful/టీడీపీ తస్మాత్ జాగ్రత్త!

http://www.toliadugu.com/2023/10/03/pavankalyanstayawayfrombjp/బీజేపీ ని వదిలించుకో! పవన్ కళ్యాణ్

Click on a star to rate it!

Average rating 4.4 / 5. Vote count: 8

No votes so far! Be the first to rate this post.