అవకాశాన్ని పవన్ కళ్యాణ్ అంది పుచ్చుకున్నాడా ?

తాజా వార్తలు తాజా విశ్లేషణలు రాజకీయ వార్తలు
0
(0)

తాజా రాజకీయ పరిణామాలను పవన్ కళ్యాణ్ అందిపుచ్చుకున్నాడా? ప్రస్తుత పవన్ వ్యవహరిస్తున్న అవలంబిస్తున్న తీరు అవుననే సమాధానం ఇస్తుంది. టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు అరెస్ట్ పవన్ కి రాజకీయంగా ఉపయోగపడే అంశంగానే పరిగణించాలి.

గత సంవత్సరాల కాలంగా పొత్తులపై జనసేన మరియు టీడీపీ తర్జన భర్జన పడుతున్నాయి…పవన్ కళ్యాణ్ పలుసందర్బాలలో పొత్తుపై బహిరంగంగా ఆసక్తిని కనబరిచాడు. పైగా చంద్రబాబుని పలుమార్లు పవన్ కళ్యాణ్ కలవటం జరిగింది.

కానీ పవన్ కళ్యాణ్ పలు ప్రసంగాలలో చేసిన వ్యాఖ్యలు టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలకి ఆగ్రహం తెప్పించాయి. సోషల్ మీడీయా వేదికగా ఇరుపార్టీ అభిమానులు ఒకరిపై ఒకరు ధూషణలు దిగారు. పైపెచ్చు ఇరు పార్టీలకు సినీకుటుంబాల పరస్పర వైరుధ్యం ఎలాగూ ఉంది.

గతంలో జరిగిన అనుభవాలు దృష్ట్యా టీడీపీ పొత్తులపై బహిరంగంగా మాట్లాడునూ లేదు.. అలాగని పొత్తు ను వ్యతిరేఖించనూ లేదు.. పైగా పార్టీలోని నాయకులు. కార్యకర్తలలో పొత్తులపై బిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో జనాల్లో అపూర్వ స్పందన, జగన్ పై వ్యతిరేఖత, చరిత్రలో నిలిచిపోయిన ఎమ్మెల్సీ ఫలితాలు టీడీపీ అనుకూలతలు ఏర్పడటం పార్టీ క్యాడర్ లో నూతనుత్తేజం నింపింది.

ఇలా టీడీపీ అనుకూల వాతావరణం కొనసాగింపుగా లోకేశ్ యువగళం పాదయాత్రను మొదలు పెట్టాడు..కానీ సామాన్య ప్రజానీకం, కొంత క్యాడర్ లో కూడా ఈ యువగళం పై లోకేశ్ పూర్తి చేయగలుగుతాడా అన్న అనుమానాలు వ్యక్తపరిచారు…కానీ జిల్లాలు మారేకొద్ది లోకేశ్ ప్రజల్లో మమేకమై జనాల్లో విపరీతమైన ఆధరణ పొందుతూ సాగిపోతున్నాడు.

మరోపక్క అధినేత చంద్రబాబు రోడ్ షోలలో ప్రజలు బ్రహ్మరధం పట్టారు. పాదయాత్ర మరియు రోడ్ షోల వస్తున్న ఆదరణ చూసి క్యాడర్ లో ఆత్మ స్థైర్యాన్ని నింపింది. పొత్తులపై ఆలోచన లేకుండా టీడీపీ ఒంటరిగా అధికారంలోకి రాగలం అనే నమ్మకాన్ని కలిగించాయి.

కానీ పొత్తుల విషయం టీడీపీ వైపు నుండి ఏదొక స్పందన లేకపోవటం, సీట్ల విషయంలో డిమాండ్ చేసే పరిస్థితులు కనపడకపోవటంతో పవన్ పొత్తుల విషయంలో సందిగ్థతలో పడిపోయారు.

సరిగ్గా ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ పవన్ కళ్యాణ్ కి మార్గం సులువైంది. అరెస్ట్ ని వ్యతిరేకించటం, చంద్రబాబుకి మద్దతు పలకటం, అ తర్వాత చంద్రబాబు ములాఖత్ అదే వేదికగా పొత్తు ప్రకటించటం ద్వారా పవన్ సానుభూతి సెంటిమెంట్ తో టీడీపీ క్యాడర్ ని మరియు పరిస్థితులు కారణంగా చూపి తన పార్టీ క్యాడర్ ని సంతృప్తి పరిచి పవన్ తన వ్యూహంతో అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడానే చేప్పాలి.

పి . కృష్ణ

నిరాకరణలు: వెబ్‌సైట్ యొక్క www.toliadugu.com లేదా సబ్‌డొమైన్‌లలో ప్రచురించబడిన కథనాలు మరియు కంటెంట్ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. www.toliadugu.com లేదా వెబ్‌సైట్ సబ్‌డొమైన్‌లలో ప్రచురించబడిన కథనాలలో ఉపయోగించిన మొత్తం సమాచారం విశ్వసనీయ మూలాల నుండి వచ్చినదని విశ్వసించబడింది, అయితే మేము దీనితో సంపూర్ణత, ఖచ్చితత్వం లేదా విశ్వసనీయత గురించి ఎలాంటి ప్రాతినిధ్యాలు లేదా హామీలు ఇవ్వము, వ్యక్తీకరించాము లేదా సూచించాము ఈ వ్యాసానికి సంబంధించి

Disclaimers: Articles and Content published on www.toliadugu.com or subdomains of the website, is just for informational purposes only. All information used in the articles published on www.toliadugu.com or subdomains of the website is believed to be from reliable sources, but we make no representations or warranties of any kind, express or implied, about the completeness, accuracy, or reliability with respect to these article.

Click on a star to rate it!

Average rating 0 / 5. Vote count: 0

No votes so far! Be the first to rate this post.