జగన్ తాజాగా రైతు భరోసా బటన్ నొక్కుడు బహిరంగ సభలో చంద్రబాబు మరియు దత్త పుత్రుడు పవన్ మీరు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము ఉందా ? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కానీ పొత్తు అనేది ఎప్పటికీ తప్పుకాదు. ఇది రాజకీయాల్లో సర్వ సాధారణం. గతంలో స్వయానా తన తండ్రి వైయస్ ఆర్ , టీఆర్ఎస్ , ఎం.ఐ. ఎం, వామపక్షాలతో కలిసి మాహాకూటమిగా ఏర్పడింది. 2004 లో అధికారంలో కి వచ్చింది. మరి తన తండ్రి కి దమ్ము లేకే పొత్తు పెట్టుకున్నాడు అని అనగలరా? అంటూ టీడీపీ , జనసేన నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
సింహం సింగిల్ అంటూ చెప్పుకుంటున్న జగన్, గత ఎన్నికల్లో కేసీఆర్ మరియు బీజేపీ జగన్ విజయానికి ఎంత కృషి చేశారో అన్నది బహిరంగ రహస్యం. కేసీఆర్ తన స్వార్థమో లేక చంద్రబాబు పైన ఆక్కసో ఆర్థికంగా మరియు పలు విధాలుగా వైకాపాకి సహాయం చేశారు. లోకేశ్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో తలసాని లాంటి టీఆరఎస్ ముఖ్యనాయకుడు బీసీ నాయకుల మీటింగ్స్ పెట్టి లోకేశ్ ఓటమికి కృషి చేశారు అనేది టీడీపీ శ్రేణుల వాదన.
ఇక ఆంధ్ర లో ఉనికిలేని బీజేపీ ఎన్నికల్లో వైకాపాకి అనుకూలంగా వ్యవహరించింది. ఈ రెండు పార్టీలతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని గెలిచిన జగన్, బహిరంగా చేయలేదు కాబట్టి తనని తాను సింహాగా బావించుకుంటున్నారా?అంటూ సోషల్ మీడీయా వేదికగా సెటైర్లు వేస్తున్నారు.
దమ్ము ధైర్యాల గురించి మాట్లాడుతున్న జగన్ మరెందుకు తాను పెట్టే సభలలో నిలువునా చెట్లను రక్షణ పేరుతో నరకటం , పరదాలు కట్టుకొని వెళ్ళటం అనేది సామాన్య ప్రజానీకానికి అంతుచిక్కని ప్రశ్న.
దమ్ము…దమ్ము అని చెప్పుకుంటున్న జగన్, ఎవరెవరు కలిస్తే నీకు నష్టం ఏంటి?. కానీ పొత్తు పెట్టుకొంటే తనకు జరిగే నష్టం జగన్ తెలుసు కాబట్టి భయంతో ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండచ్చు అని అనుకోవచ్చు.
కొసమెరుపు: పేదల ప్రభుత్వం , రూపాయ్ జీతంగా చెప్పుకుంటున్న సీయం జగన్. ఈరోజు సభ కు తాడేపల్లి నుంచి తెనాలికి హెలిప్యాడ్ లో రావటం విశేషం.
నిరాకరణలు: వెబ్‌సైట్ యొక్క www.toliadugu.com లేదా సబ్‌డొమైన్‌లలో ప్రచురించబడిన కథనాలు మరియు కంటెంట్ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. www.toliadugu.com లేదా వెబ్‌సైట్ సబ్‌డొమైన్‌లలో ప్రచురించబడిన కథనాలలో ఉపయోగించిన మొత్తం సమాచారం విశ్వసనీయ మూలాల నుండి వచ్చినదని విశ్వసించబడింది, అయితే మేము దీనితో సంపూర్ణత, ఖచ్చితత్వం లేదా విశ్వసనీయత గురించి ఎలాంటి ప్రాతినిధ్యాలు లేదా హామీలు ఇవ్వము, వ్యక్తీకరించాము లేదా సూచించాము ఈ వ్యాసానికి సంబంధించి
Disclaimers: Articles and Content published on www.toliadugu.com or subdomains of the website, is just for informational purposes only. All information used in the articles published on www.toliadugu.com or subdomains of the website is believed to be from reliable sources, but we make no representations or warranties of any kind, express or implied, about the completeness, accuracy, or reliability with respect to these article.