స్వర్గీయ నందమూరి తారకరామ రావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు లో ఎన్టీఆర్ ఒక ముసలావిడ దగ్గర ఉన్నప్పుడు “చిన్నపిల్లవాడు.. మామ్మ ఎప్పుడు రాగి ముద్ధేనా.. వరి అన్న తినమ అంటే.. ఆ బామ్మ సామి బువ్వ… దినాము సామి బువ్వ తినాలి అంటే ఆ దేవుడే దిగిరావాలనటం ఆనాటి పరిస్థితులకు అద్దం పట్టింది“. కానీ పేదలకు స్వంత నిధులతో అన్నా క్యాంటీన్ నడుపుతూ పట్టెడన్నం పెడుతున్న టీడీపీ ఆ ముద్ద పేదవాడికి అందకుండా జగన్ సర్కార్ లాగేయటం చూస్తుంటే ఈనాటి ఆంద్రప్రదేశ్ పరిస్థితులు అద్దం పడుతుంది. ఈ పరిస్థితులు పోవటానికి ఏ దేవుడు దిగిరావాలో?.
టీడీపీ అన్నా క్యాంటీన్ నడపటమే శాపం అయ్యిందా ?
మొన్న మంగళగిరి.. నిన్న కుప్పం.. నేడు తెనాలి టీడీపీ నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ల వద్ద వైకాపా నాయకులు చేసిన రచ్చ, అధికార పార్టీ కి దాసోహం అయిన పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సామాన్య ప్రజానీక విస్మయం వ్యక్తం చేస్తుంన్నారు.ఒక ప్రధాన ప్రతిపక్షనేత నియోజకవర్గం లో అన్నా క్యాంటీన్ మొదల పెట్టాయటానికి వచ్చినప్పుడు క్యాంటీన్ ద్వంసం తో పాటు టీడీపీ కార్యకర్తలు తలలు పగలుకొట్టి , గాయపర్చిన సంఘటనలు అధికార పార్టీ దాష్టీకాన్ని తెలియజేస్తుంది. లోకేశ్ మంగళగిరిలో నిర్వహిస్తున్న అన్నాక్యాంటీన్ ఇదే పరిస్థితి.
వైకాపా నే చేయచ్చు కదా?
“మేము పెట్టం.. పెట్టె వాళ్ళను పెట్టనివ్వం” అన్న చందానా తయారయ్యింది జగన్ ప్రభుత్వం.గత టీడీపీ ప్రభుత్వంలో మొదలు పెట్టి 5 రూపాయిలకే అల్పాహారం మరియు భోజనం పేదవారికి ఆకలిని తీర్చింది. చిన్నా చితకా పనులు చేసుకునేవారు , కూలీలు, యాచకూలకు, ఎటువంటి ఆసరా లేనివారికి 5 రూపాయిలతో కడుపునిండా తినేవారు. 2019 లో అధికారం లో కి వచ్చిన వైకాపా ప్రభుత్వం అన్నా క్యాంటీన్ లను మూసి వేసింది. అధికారం చేపట్టిన కొద్ది నెలల వ్యవధిలో ఇసుకు ఆన్లైన్ అంటూ ఇసుకు దొరకకుండా చేయటంతో పనులు లేక రోజువారీ కూలీలతో నడిచే కుటుంబాలు రోడ్డున పడ్డారు. ఆ తర్వాత కరోనా సరేసరి ఈ కఠిన సమయాల్లో అన్నా క్యాంటీన్ ఎంతోకంతా పేదవాడి ఆకలి తీర్చేది. “సంక్షేమ పథకాలు .. రేషన్ ఇస్తున్న అన్నా వాటితోనే కుటుంబాలు బతకకాలేవు... ఇప్పటికీ ఎటువంటి ఆసరా లేని వాళ్ళు కూడా ఉన్నారు “. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ అమ్మ క్యాంటీన్ తో అదే పేరుతో నడుపుతున్నాడు.పోనీ అన్నా క్యాంటీన్ అని ఇష్టం లేకపోతే” రాజన్న క్యాంటీన్ అనో లేక వైఎసార్ క్యాంటీన్ అనో” పెట్టి నడిపుంటే పేద ప్రజల్లో ప్రభుత్వం పై మంచి అభిప్రాయం ఏర్పడేది. పంచాయితీ లకు , అన్నా క్యాంటీన్ రంగులు మార్చటానికి దాదాపుగా సుమారు 1400 కోట్లు రాష్ట్ర ప్రజల సొమ్ముని వృధా చేసింది. అదే వైకాపా ప్రభుత్వం ఆ డబ్బును క్యాంటీన్ లు నడిపుంటే బాగుండేదేమో!
ఎవరికి నష్టం
లక్ష్యల్లో జీతాలు తీసుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు అసలు ఎందుకో గత 2 సంవత్సరాలుగా జగన్ తీసుకునే నిర్ణయాలు వల్ల అనిపిస్తుంది లేక జగన్ అంతా తానే వ్యవహరిస్తున్నారో తెలియదు. అన్నా క్యాంటీన్ నిర్వహించటం వల్ల టీడీపీ కి ఎక్కడ లాభం చేకూరుతుందో అని వైకాపా కి ప్రజల్లో నష్టం అని తెలియదా? కుప్పంలో వచ్చే ఎన్నికలలో ప్రతిపక్ష నేత చంద్ర బాబు ని ఓడిస్తాం అని బీరాలు పలికి కుప్పంలో దాష్టీకం చేయించిన వైకాపా నాయకులకు ప్రజలు హార్షిస్తారా?ఈ మాత్రం తెలియదా లేకా ఇవన్నీ ఒక మూర్ఖపు చర్యకు భావించాలా ? అసలే ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కోంటున్న జగన్ ప్రభుత్వంఇటువంటి చర్యలు ఆపక పోతే బారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
— పి. కృష్ణ