చంద్రబాబు తగ్గేదేలే – మొదటి అధ్యాయం

తాజా వార్తలు తాజా విశ్లేషణలు
5
(1)

చంద్రబాబు తన రాజకీయ చదరంగలో పావులను తనదైన రీతిలో చాకచక్యంగా కడుపుతూ వస్తున్నాడు. ఒకప్పుడు బాబు కి ఇప్పుడున్న బాబు చాలా వ్యత్యాసం కనపడుతుంది. ఎప్పుడు దూకుడు ప్రదర్శించించని బాబు ఇప్పుడు మాత్రం తగ్గేదేలే అని తాను వ్యవహరిస్తున్న తీరు తెలియజేస్తుంది. గతంలో ఏదైనా నిర్ణయం తీసుకోవటానికి వంద రకాలుగా ఆలోచించి నాన్చుడి దోరణి ఉండేది.

1) పొత్తు నిర్ణయాలు

అప్పుడు

గతంలో పార్టీ అవసరాల దృష్ట్యా చంద్రబాబు ఇతర పార్టీలతో పొత్తుల పెట్టుకునేవారు. బీజేపీ తో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు తానే స్వయంగా బీజేపీ మిత్ర పక్షం అయిన జనసేన అద్యక్షుడు పవన్ ఇంటికి వెళ్ళి ప్రచారం చేయవలసిందిగా కోరటం పవన్ చేయటం జరిగింది. 2014 అధికారం చేపట్టీనప్పటి నుండీ చంద్రబాబు పవన్ పై ప్రత్యేక గౌరవం తో పాటు పవన్ లేవనెత్తిన సమస్యలను తక్షణమే పరిష్కరించేవాడు. అయినప్పటికి చంద్రబాబు ని పవన్ పలు సందర్భాలలో విమర్శస్తూ , తన మూలమగానే టీడీపీ అధికారంలో కి వచ్చింది. అనే భావంతో పలు సందర్బాలలో వ్యక్తపరచటం బాబుకు టీడీపీ కార్యకర్తలు నచ్చని ఆంశం. ఇలా పలు పరిణామాలతో 2019 ఒంటరిగా పోటీ చేయటం జరిగింది.

ఇప్పుడు

పొత్తుల విషయంలో టీడీపీ మరియు జనసేన పార్టీలకు సానుకూల పవనాలు వీచాయి. బాబు రాష్ట్ర అవసరాల దృష్ట్యా ప్రతిపక్షాలను కలుపుకుపోతాం అనటం తర్వాత జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం అనటంతో పొత్తు అనివార్యం అని అందరూ భావించారు. తర్వాత పవన్ ఇచ్చిన ఆప్షన్స్ తో పొత్తులకు తాత్కాలిక బ్రేక్ పడింది.

ఇప్పుడు పొత్తుల విషయంలో బాబు మరింత దూకుడు గా ముందుకు వెళ్తున్నారు. జిల్లాల వారీగా ఇంచార్జ్ లను నియామిస్తున్న టీడీపీ ఇప్పుడు గోదావరి జిల్లాలకు సంభదించి టీడీపీ పార్టీ ఇంచార్జ్ లను నియోజవర్గాలవారిగా సర్వే చేసి నియమిస్తున్నారు. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న గోదావారి జిల్లాలలో ఇలా ముందుగానే నియమించటం ద్వారా జనసేన పొత్తు విషయంలో ఎటువంటి ఆలోచనలు చేస్తున్నట్లు అనిపించట్లేదు.వ్యతిరేక ఓటు చీలకుండా ప్రభుత్వం పై పోరాడాలనుకుంటే ఎవరినైనా కలుపుకుపోతాం కానీ ఎవరినీ పోత్తుల విషయంలో తామంతట తాముగా ఎవరినీ ఆడగం అన్నట్లుగా బాబు ధోరణి కనపడుతుంది. తద్వారా పొత్తు కోసం ఆసక్తి కనబరుస్తున్న జనసేన కలిసి వస్తే ఆపార్టీ బలం మేరకే సీట్లను కేటాయిస్తాం కానీ డిమాండ్ చేసినన్ని సీట్లు ఇచ్చే ప్రసక్తి లేదని, ఒక వేళ ఎవ్వరూ రాని పక్షంలో తాము ఒంటరిగా పోటీ చేయటానికి సిద్ధం అనే విధంగా ఉంది.

(ఇంకా ఉంది )

— పి. కృష్ణ

నిరాకరణలు: వెబ్‌సైట్ యొక్క www.toliadugu.com లేదా సబ్‌డొమైన్‌లలో ప్రచురించబడిన కథనాలు మరియు కంటెంట్ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. www.toliadugu.com లేదా వెబ్‌సైట్ సబ్‌డొమైన్‌లలో ప్రచురించబడిన కథనాలలో ఉపయోగించిన మొత్తం సమాచారం విశ్వసనీయ మూలాల నుండి వచ్చినదని విశ్వసించబడింది, అయితే మేము దీనితో సంపూర్ణత, ఖచ్చితత్వం లేదా విశ్వసనీయత గురించి ఎలాంటి ప్రాతినిధ్యాలు లేదా హామీలు ఇవ్వము, వ్యక్తీకరించాము లేదా సూచించాము ఈ వ్యాసానికి సంబంధించి

Disclaimers: Articles and Content published on www.toliadugu.com or subdomains of the website, is just for informational purposes only. All information used in the articles published on www.toliadugu.com or subdomains of the website is believed to be from reliable sources, but we make no representations or warranties of any kind, express or implied, about the completeness, accuracy, or reliability with respect to these article.

Click on a star to rate it!

Average rating 5 / 5. Vote count: 1

No votes so far! Be the first to rate this post.