బింబిసార: ఆకట్టుకున్న ఈశ్వరుడే పాట

తాజా విశ్లేషణలు
0
(0)

కళ్యాణ్ రామ్ తో యువ డైరెక్టర్ వశిష్ట్ మల్లిడి తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ బింబిసార. బ్యూటిఫుల్ హీరోయిన్స్ క్యాథరీన్ థ్రెసా, సంయుక్తా మీనన్, వరీన హుస్సేన్ కళ్యాణ్ రామ్ కి జోడీగా నటిస్తున్న ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె హరికృష్ణ ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. త్రిగర్తల రాజ్యాధిపతి బింబిసారుడి పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఈ మూవీ పై మొదటి నుండి అందరికీ ఎన్నో అంచనాలు ఉండగా, ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలు మరింతగా పెంచేసింది.

ఇక నేడు ఈ మూవీ నుండి యువ గాయకుడు కాలభైరవ పాడిన ఈశ్వరుడే అనే పల్లవితో సాగె ఎమోషనల్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది యూనిట్. శ్రీమణి ఎంతో గొప్పగా రాసిన ఈ సాంగ్ లిరిక్స్ కి సంగీత దర్శకుడు చిరంతన్ అలరించే ట్యూన్ ని ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఈ సాంగ్ అందరినీ ఎంతో ఆకట్టుకుంటోంది. హై టెక్నీకల్ వాల్యూస్ తో గ్రాండియర్ గా తెరకెక్కిన బింబిసార మూవీ ఆగష్టు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

Click on a star to rate it!

Average rating 0 / 5. Vote count: 0

No votes so far! Be the first to rate this post.