మోదీ వరుసగా రెండు సార్లు అధికారాన్ని కట్టబెట్టిన దేశ ప్రజలకు మోదీ పదే పదే చెప్తున్నట్టుగా అచ్చేదిన్ మటుకు రావటం లేదు. మోదీ ప్రధాన పదవి చేపట్టినప్పటి నుండి ప్రజలకు కష్టాలు , భారాలు పడుతూనే ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తూ వస్తుంది.
పడిపోతున్న రూపాయి విలువ
“ఆర్థిక వ్యవస్థపైనా, రూపాయి పతనంపైనా ప్రభుత్వానికి శ్రద్ధ లేకపోవడంతో దేశం నేడు నిరాశకు గురవుతోంది. దేశం ఇంతటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఊహించి ఉండకపోవచ్చు. కానీ అటువంటి సంక్షోభ సమయంలో నాయకత్వం దిశ తక్కువగా ఉన్నప్పుడు, నిస్సహాయత పెరుగుతుంది. ప్రజల్లో విశ్వాసం నింపేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు – నరేంద్ర మోదీ (2013 లో అప్పటి యూపీఏ ప్రభుత్వం పై )“
పైన చెప్పిన మాటలు సరిగ్గా ఇప్పటి ఎన్డీయే ప్రభుత్వం ప్రస్తుత ప్రధాని కి సరిగ్గా సరిపోతుంది. డాలర్ మారకం తో రూపాయి విలువ రోజూ రోజు కి క్షీణిస్తూ వస్తుంది. 2014 మోదీ ప్రధాని అయ్యే సమయానికి 1 డాలర్ రూపాయి విలువ 68 రూపాయలు గా ఉంది. కానీ ఇప్పుడు 79.22 రూపాయలకి పడిపోయింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, చమురు ధరల జోరు, అమెరికా వడ్డీ రేట్లను పెంచడంవంటి పరిణామాలు ఇటీవల మన రూపాయి పతనానికి ప్రధాన కారణాలు ఎన్డీయే చెప్తున్నాయి. ఎగుమతులు 43.8 % రికార్డ్ స్థాయి పెరిగాయి కానీ అదే స్థాయిలో దిగుమతులు కూడా 19,241కోట్ల డాలర్ల వాణిజ్యలోటు ఏర్పడి- రూపాయి పతనానికి దారితీసింది. ఈ పతనం సామాన్య ప్రజల పే భారం పెరుగుతుంది.
“అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్‌లో భారత్ నిలదొక్కుకోదు. వస్తువులను ఎగుమతి చేసే మరియు దిగుమతి చేసుకునే మన వ్యాపారవేత్తలు దీనిని కొనసాగించలేరు. దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం కూడా నిలబడలేకపోతోంది– నరేంద్ర మోదీ (2013 లో అప్పటి యూపీఏ ప్రభుత్వం పై )“
పై విధంగా చెప్పినట్టు ఈ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో మన ప్రధాని గారే చెప్పాలి.
నిరుద్యోగ రేటు
ఎకనామిక్ థింక్-ట్యాంక్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) విడుదల చేసిన డేటా ప్రకారం, ప్రధానంగా వ్యవసాయ రంగంలో 13 మిలియన్ల ఉద్యోగాలు కోల్పోవడంతో జూన్‌లో దేశంలో నిరుద్యోగిత రేటు 7.80 శాతానికి పెరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు మే నెలలో 6.62 శాతం నుంచి 8.03 శాతానికి చేరుకోవడంతో గత నెలలో ఉద్యోగాల సంఖ్య భారీగా పడిపోయింది. పట్టణ ప్రాంతాల్లో, మే నెలలో నమోదైన 7.12 శాతంతో పోలిస్తే 7.30 శాతం వద్ద కొంచెం మెరుగ్గా ఉందని CMIE డేటా తెలిపింది.
రిపోర్టింగ్ నెలలో 13 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు, నిరుద్యోగుల సంఖ్య కేవలం 3 మిలియన్లు మాత్రమే పెరిగింది. ఈ విషయయంలో సొషల్ మాధ్యమంలో యువత మోదీ పై విమర్శలతో పాటు ఇండియా వైడ్ ట్రెండ్ అవ్వటం యువతలో మోదీ వ్యతిరేఖత తెలియజేస్తుంది.
పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశమే హద్దు
“పెట్రోల్ ధరలను భారీగా పెంచడం కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ వైఫల్యానికి ప్రధాన ఉదాహరణ. దీంతో ప్రజలపై వందల కోట్ల భారం పడనుంది – నరేంద్ర మోదీ (2013 లో అప్పటి యూపీఏ ప్రభుత్వం పై )”
అప్పటి పెట్రోల్ లీటర్ ధర ₹71.41 కాగా ఇప్పుడు ₹109.64 , డీజిల్ లీటర్ ధర ₹55.49 కాగా ఇప్పుడు ₹ 98.27, గ్యాస్ సిలిండర్ ధర ₹410 కాగా ఇప్పుడు అత్యధికంగా ₹1150 కి చేరుకుంది ₹27.37 బేస్ ప్రైస్ కు దొరుకుతున్న పెట్రోల్ కు మితిమీరిన టాక్స్ లు జోడించటం పైగా రాష్ట్రాల బాదుడు తో సామాన్య ప్రజలపై భారం కావా మిస్టర్ నరేంద్ర మోదీ. ఈ రకంగా డీజిల్ రేట్లు పెరగటంతో అది రవాణా వ్యవస్థ మీద పడటం దాని పర్యవ్యసానం గా సామాన్య ప్రజల పైనే కదా భారం చౌకీధార్ మోదీ. ఇక గ్యాస్ సిలిండర్ విషయంలో 400రూపాయిలుగా ఉన్నసమయంలో బీజేపీ మరియు స్మితి ఇరానీ చేసినా రాద్ధాంతం అంతా ఇంతా కాదు. కానీ ఇప్పుడు ఆ 400 రూపాయిలకి అదనంగా 700 రూపాయిలు కలిపి 1100 రూపాయిలకు ఎందుకు పెరిగిందో సమాధానం లేదు.
బ్యాంక్ దొంగలు
2022 ఆర్థిక సంవత్సరంలో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 604 బిలియన్ల భారతీయ రూపాయల మొత్తంలో బ్యాంకు మోసాలను నివేదించింది. ఇది 2021లో 1.3 ట్రిలియన్ రూపాయలకు పైగా తగ్గుదల. తద్వారా, బ్యాంకు మోసాల విలువ గత దశాబ్దంలో బ్యాంక్ మోసాలు మొత్తం సంఖ్యలలో మరియు మోసాల విలువలో గణనీయంగా పెరిగిన తర్వాత, బ్యాంకు మోసాల విలువ ట్రెండ్ చుట్టూ తిరిగింది.పై మొత్తంలో దాదాపుగా 560 బిలియన్లు మన చౌకీదార్ ప్రభుత్వంలో నే మాల్యా, నీరవ మోదీ, ఋషి అగర్వాల్ , రానా కపూర్ మరియు ఇంకొంత మంది బ్యాంకుల కు టోకారా వేసి విదేశాలలో జల్సాలు చేస్తున్నారు. బ్యాంక్ లు ఆ అప్పును సామాన్యుల ఖాతాలను ఎప్పుడు , ఎందుకు ,ఎలా పెనాల్టీ రూపంలో ఖాతాదారునికి తెలియకుండా వసూలు చేసుకుంటూ వస్తుంది. ఎప్పుడు బీరాలు పలికే ఛాయ వాలా టు ప్రధాని మంత్రి అయిన మోదీ బ్యాంక్ దొంగలు విషయంలో ఎందుకు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారో ?
దేశ భక్తే ముడి చమురుగా వాడుకుంటూ బీజేపీ కి వ్యతిరేఖంగా మాట్లాడిన వాడిని దేశద్రోహిగా చూస్తున్న మోదీ భక్త్ లు కి కేవలం పైనవన్ని నిజాలే అని గ్రహించగలరు.
(ఇంకా ఉంది)
— పి కృష్ణ