అమరావతి రాజధాని:తాడికొండ నియోజకవర్గం లో టీడీపీ ఎందుకు ఓడిపోయింది

తాజా విశ్లేషణలు రాజకీయ వార్తలు
4
(4)

2019 ఎన్నికలలో టీడీపీ పార్టీ ఘోర ఓటమి పాలయ్యింది కానీ ఇప్పటికి చాలా మంది మదిలో ఉన్న ప్రశ్న కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అమరావతి రాజధాని చేసినప్పటికి తాడికొండ నియోజకవర్గం లో టీడీపీ ఎందుకు ఓడిపోయింది.దానికి గల కారణం
2009 నుంచి మొదలు పెడదాం
అప్పటి వరకు 2 సార్లు ఎమ్మెలే పుష్పరాజ్ స్థానం అది అయన మినిష్టెర్ గా కూడా చేసారు,కానీ 2009 లో ఆయన్ని కాదని ప్రభుత్వ ఉద్యోగిగా పనిచెసిన ఒక వ్యక్తిని ఎమ్మెలే అభ్యర్థిగా గా తీసుకోవటం జరిగింది.అతనికి చాల మంచి వ్యక్తి అనే ఇమేజ్ ఉన్నప్పటికి డబ్బులు లేకపోవటంతో 2009 ఎన్నికలలో ఓడిపోవటం జరిగింది.

అదే వ్యక్తి టీడీపీ క్యాడర్ ను కలుపుకుపోవటం, సామాన్య ప్రజల్లో వైకాపా ఎమ్మెలే అభ్యర్థి కన్నా ఇతనికి మంచి ఇమేజ్ ఉండటంతో 2014 ఎన్నికలలో విజయం సాధించాడు.

ఇక్కడే మొదలైంది అసలు కథ

టీడీపీ కి ఈ నియోజక వర్గంలో ప్రతి ఊరిలో రెండు వర్గాలు ఉన్నాయి. వారి మధ్య అంత సఖ్యత లేనప్పటికి పార్టీ కొసం ఎవరికి వారు తమ వంతు కృషి చేస్తూండేవారు.

2014 లో రూలింగ్ లోకి వచ్చాక

ఈయన ఏ కారణాల వల్లనో ఒక వర్గాన్ని దగ్గర చేసుకొని మిగతావాళ్ళని దూరం పెట్టి అవమానించడం మొదలుపెట్టాడు.
ఓకానొక సమయంలో వాళ్ళతో అయన అన్న మాట అందర్ని అశ్చర్యానికి గురి చేస్తుంది అదేంటి అంటే “మీరు నాకు ఓటు వేయకపోయినా నాకు వేసే వాళ్ళూ ఉన్నారు లే “ అని అనే దాక చేరిందట అయన తీరు . ఇలా తాడికొండ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఊరిలో ఇదే తంతు, పైగా పెద్దమనిషిగా వ్యవహరించాల్సిన చోట పుల్లలు పెట్టి తగాదాలు పెట్టటం.

కానీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఉన్నప్పుడు కాంగ్రెస్స్ క్యాడర్ తో ఇలంటివి వస్తే అయన చాల బాగా హ్యాండిల్ చేసేవారని ఆక్కడి వారి అభిప్రాయం.

ఇలా ఒకవర్గానికి చెందిన టీడీపీ వారు టీడీపీ అభ్యర్థి అయిన శ్రవణ్ కుమార్ గెలవకూడదు అని వైకాపా తరుపున డబ్బులు కూడా పంచారు అంటే ఆలోచించండి ఏ స్థాయిలో సొంత క్యాడర్లో వ్యతిరేకత ఉందో.

2019 ఎన్నికలలో శ్రవణ్ కుమార్ కు టికెట్ ఇవొద్దు అని ఆధిష్టానానికి విన్నవించుకోవటం , పార్టీ కష్టాల్లొ ఉన్నప్పుడు డబ్బులు ఆస్థులు అమ్మి డబ్బులు ఖర్చు పెట్టిన కార్యకర్తలకి అభీష్టాన్ని అధిష్టానం గౌరవించకపోవటం కార్యకర్తలకు మింగుడు పడని ఆంశం.

ఇక్కడ టీడీపీ కార్యకర్తలు లకు పార్టీ మీద ఇష్టం, చంద్రబాబు నాయుడు అంటే గౌరవం ఉన్నప్పటికీ స్థానికి అభ్యర్థి శ్రవణ్ కుమార్ పై ఉన్న కోపం కారణంగా అ వర్గం క్రాస్ వోటింగ్ వల్ల కేవలం 5వేల వోట్ల మెజారిటీ తో వైకాపా అభ్యర్థి గెలవటం జరిగింది.

నిరాకరణలు: వెబ్‌సైట్ యొక్క www.toliadugu.com లేదా సబ్‌డొమైన్‌లలో ప్రచురించబడిన కథనాలు మరియు కంటెంట్ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. www.toliadugu.com లేదా వెబ్‌సైట్ సబ్‌డొమైన్‌లలో ప్రచురించబడిన కథనాలలో ఉపయోగించిన మొత్తం సమాచారం విశ్వసనీయ మూలాల నుండి వచ్చినదని విశ్వసించబడింది, అయితే మేము దీనితో సంపూర్ణత, ఖచ్చితత్వం లేదా విశ్వసనీయత గురించి ఎలాంటి ప్రాతినిధ్యాలు లేదా హామీలు ఇవ్వము, వ్యక్తీకరించాము లేదా సూచించాము ఈ వ్యాసానికి సంబంధించి

Disclaimers: Articles and Content published on www.toliadugu.com or subdomains of the website, is just for informational purposes only. All information used in the articles published on www.toliadugu.com or subdomains of the website is believed to be from reliable sources, but we make no representations or warranties of any kind, express or implied, about the completeness, accuracy, or reliability with respect to these article.

Click on a star to rate it!

Average rating 4 / 5. Vote count: 4

No votes so far! Be the first to rate this post.