దీనికి సమాధానం ఏంటి జగన్ మోహన రెడ్డి ?

తాజా వార్తలు తాజా విశ్లేషణలు రాజకీయ వార్తలు
5
(1)

ఎన్నికల ముందు

“నాకు పూర్తిస్థాయిలో ఎంపీలను గెలిపించి ఇవ్వండి హోదా ఎలా రాదో నేనూ చూస్తా.- జగన్ “

ఎన్నికల తర్వాత

” ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కేంద్రాన్ని మనం ప్రత్యేక హోదా అడుగలేం , ఎందుకంటే మన అవసరం కేంద్రానికి లేదు , మున్ముందు ఆ అవకాశం వస్తే ఆడుగుదాం. – జగన్ “

మరి ఇప్పుడు

డిల్లీ మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ని తీసుకొస్తా అన్న జగన్ కి ఇప్పుడు కేంద్రాన్ని అడిగే అవకాశం రాష్ట్రపతి ఎన్నికల రూపంలో వచ్చింది , కానీ మన ముఖ్యమంత్రి కి ఆ విషయం ఏమాత్రం పట్టటం లేదు ,ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికలలో కేంద్రానికి ఇప్పుడు మన రాష్ట్ర మద్దతు చాలా అవసరం రావటం తో జగన్ మోహన్ రెడ్డి ని కేంద్ర ప్రభుత్వం డిల్లీకి పిలించుకొని తమకు మద్దతు ఇవ్వవలసిందిగా కోరింది. ఇటువంటి సమయం లో రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా ఇస్తే మద్దతు ఇస్తాం అనే డిమాండ్ చేయవచ్చు. ఒక వేళ అడిగితే కేంద్రం ఆలోచించక తప్పదు. కారణం , ఒక వేళ వైకాపా మద్దతు ఇవ్వని పక్షంలో చాలా రాష్ట్రాల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది , పైగా వారి రాష్ట్రాల డిమాండ్ల తీర్చాల్సిఉంటుంది. ఇటువంటి అవకాశాన్ని జగన్ ఉపయోగించుకో కపోవటం మరియు ముందు నుంచి కేంద్రానికి పార్లమెంట్ , రాజ్యసభల్లో లో ఆమోదించాల్సిన బిల్లులకు వైకాపా ని ఆడగకున్న మద్దతు తెలపటం ద్వారా స్వప్రయోజనాలకు రాష్ట్రాన్ని పణంగా పెట్టాడా అని అనుమానాలు కలగక మానదు.

ముందు నుండి జగన్ మాటల్లో ఉన్న బలం చేతల్లో లేదు అని జరుగున్న పరిస్థితులు , పరిణామాలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రానికి అవసరమైన ఒక పోలవరం విషయం లో కానీ , ఒక రైల్వే జోన్ విషయం లో కానీ , స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ విషయం లో గాని , పోర్టలు ప్రవేటీకరణ లో కానీ రాష్ట్రం పట్ల తనకున్న భాద్యతను , కేంద్రం పట్ల ఉన్న భయాన్ని తెలియజేస్తుంది. జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో సీబీఐ చాలా దూకుడిగా ముందుకు వెళ్ళటం , ఆక్రమాస్తుల కేసులలో ఏ క్షణమైనా మళ్ళీ జైల్ కి వెళ్ళవలసి వస్తుంది అని భయం ఉన్న జగన్, రాష్ట్రానికి రావాలిసిన వాటిపై కేంద్రాన్ని నిలదీయగలడా?ఉన్న ఈ అవకాశాంతో జగన్ రాష్ట్రానికి ఏం సాధించుకోచ్చాడు అంటే రాష్ట్రానికి అప్పు కూడా ఇవ్వని ఆర్ బీ ఐ నుండి కేంద్రం సహాకారంతో మరియు రాష్ట్ర మందు బాబులు ద్వారా రాష్ట్రానికి రాబోయే ఆదాయం పై 8500 కోట్లు అప్పు సాదించారు , ఈ డబ్బుతో కొన్ని నెలలు పాటు రాష్ట్రం బండి నడపవచ్చు , కేంద్రం సహకారంతో జగన్ తనపై ఉన్న అవినీతి కేసుల్లో కొంతకాలం ఉపశమనం పొందవచ్చునేమో ?ఇలా కేంద్రం చేతుల్లో జుట్టు ఉన్నంతకాలం రాష్ట్రానికి అవసరాలకోసం జగన్ కేంద్రం మెడలు వంచలేడు అనేది సుస్పష్టం.

–పి. కృష్ణ

నిరాకరణలు: వెబ్‌సైట్ యొక్క www.toliadugu.com లేదా సబ్‌డొమైన్‌లలో ప్రచురించబడిన కథనాలు మరియు కంటెంట్ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. www.toliadugu.com లేదా వెబ్‌సైట్ సబ్‌డొమైన్‌లలో ప్రచురించబడిన కథనాలలో ఉపయోగించిన మొత్తం సమాచారం విశ్వసనీయ మూలాల నుండి వచ్చినదని విశ్వసించబడింది, అయితే మేము దీనితో సంపూర్ణత, ఖచ్చితత్వం లేదా విశ్వసనీయత గురించి ఎలాంటి ప్రాతినిధ్యాలు లేదా హామీలు ఇవ్వము, వ్యక్తీకరించాము లేదా సూచించాము ఈ వ్యాసానికి సంబంధించి

Disclaimers: Articles and Content published on www.toliadugu.com or subdomains of the website, is just for informational purposes only. All information used in the articles published on www.toliadugu.com or subdomains of the website is believed to be from reliable sources, but we make no representations or warranties of any kind, express or implied, about the completeness, accuracy, or reliability with respect to these article.

Click on a star to rate it!

Average rating 5 / 5. Vote count: 1

No votes so far! Be the first to rate this post.